Upma Benefits : ఉప్మాను ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు.. కానీ ఇది డైట్ ఫుడ్.. బ్రేక్ ఫాస్ట్ లలో చాలా సులువుగా చేసుకొనే టిఫిన్ లలో ఉప్మా ఒకటి.. చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. అయితే చాలా మందికి ఉప్మా అస్సలు నచ్చదనే చెప్పవచ్చు. ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా అయిన ఉంటారు కానీ ఇంట్లో తయారు చేసే ఉప్మాను మాత్రం తినరు. అలాగే మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద అనేక రకాల టిఫిన్స్ దొరుకుతాయి కానీ ఉప్మా మాత్రం దొరకదు.. అక్కడ తినడానికి ఇష్టపడరు.. కానీ ఉప్మా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఉప్మాను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. గుండె మరియు మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఉప్మాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తక్కువ నూనెతో తయారు చేస్తారు కనుక ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. ఈ ఉప్మా పోపులో పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు వంటి వాటిని వేసి తయారు చేస్తారు. కనుక ఉప్మాను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింతగా మేలు కలుగుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది..
Also Read
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉప్మాను తయారు చేసుకుంటారు.. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే.. క్యారెట్, బీన్స్, బఠాణీ, టమాట వంటి కూరగాయ ముక్కలు, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు వంటి వాటిని కూడా వేస్తాము. కాబట్టి ఉప్మాను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా ఉప్మా మనకు దోహదపడుతుంది. ఈ విధంగా ఉప్మా కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని, దీన్ని కూడా వారంలో ఒకసారన్నా చేసుకొని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!