డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ అన్నీ ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. చేతిలో నగదు లేకున్నా చింతించాల్సిన అవసరం లేకుండాపోయింది. అయితే కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల యూపీఐ సేవలు నిలిచిపోతే యూజర్లు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. తాజాగా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. యూపీఐ సర్వర్ డౌన్ అయ్యింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావడం లేదని.. బ్యాలెన్స్ చెక్ చేసుకొందామన్నా సాధ్యం కావడం లేదని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. అన్ఏబుల్ టు లోడ్ అకౌంట్ అనే మెసేజ్ వస్తోందంటూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లు వాపోతున్నారు.
UPI: యూపీఐ సర్వర్ డౌన్ .. ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లు
- దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి
- యూపీఐ సర్వర్ డౌన్
- అన్ఏబుల్ టు లోడ్ అకౌంట్ అనే మెసేజ్ వస్తోందంటూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లు

Upi Transaction