UPI Payment Fecility: ఇతర దేశాల్లో ఉండే ఇండియన్లు భారతదేశానికి డబ్బు పంపటం ఇక ఈజీ అయింది. మన దేశంలో అద్భుతమైన ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్.. UPI అనే ఆన్‌లైన్ చెల్లింపుల విధానం ఇప్పుడు 10 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. UPIని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. NPCI ఈ మేరకు ప్రకటన చేసింది.
Work From Home: ఇన్ఫోసిస్‌కి ఇష్టం.. టీసీఎస్‌కి కష్టం..
ఎంపిక చేసిన 10 దేశాల్లో ఉపయోగించే ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్లతో లింక్ చేసిన అకౌంట్ల నుంచి కూడా మన దేశానికి డబ్బు పంపొచ్చని NPCI వెల్లడించింది. సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల్లో నివసించే ఇండియన్లకు UPI యాక్సెస్ ఇస్తున్నట్లు NPCI పేర్కొంది.
NPCIలో 382 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లోని NRI ఖాతాలన్నింటినీ UPI వేదిక పైకి ఏప్రిల్ 30వ తేదీ లోగా తీసుకురావాలని NPCI సూచించింది. నేపాల్, భూటాన్, సింగపూర్ కూడా UPI పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తమ పేమెంట్ నెట్‌వర్క్‌లను UPIకి జత చేసేందుకు NPCIతో ఒప్పందాలను సైతం కుదుర్చుకున్నాయి.
ఇదిలాఉండగా.. ఫారన్ కంట్రీస్‌లో ఉండే ఇండియన్లు మన దేశానికి పంపిన డబ్బు 2022వ సంవత్సరంలో సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది 2021తో పోల్చితే 12 శాతం ఎక్కువని పేర్కొంది.