Upcoming Telugu Movies: చాలామంది భారీ బడ్జెట్ చిత్రాలు, యాక్షన్ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నప్పటికీ.. రాబోయే రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద కొన్ని క్యూట్ లవ్ స్టోరీస్ సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. మిడ్ రేంజ్, చిన్న హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రాలు అన్నీ ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి విడుదలకు సిద్ధమయ్యాయి. భారీ యాక్షన్ సినిమాల హోరు మధ్యలో, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి ఈ క్యూట్ లవ్ స్టోరీలన్నీ బాక్సాఫీస్ బాట పట్టాయి. మరి ఆ అందమైన ప్రేమకథల వివరాలేంటో చూద్దామా..
అక్టోబర్ లో రానున్న లవ్ స్టోరీస్
అక్టోబర్ నెలలో వరుసగా పలు ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ‘కోర్టు’ వంటి క్యూట్ లవ్ స్టోరీతో మంచి విజయం అందుకున్న హర్షి రోషన్, అక్టోబర్ 2న ‘తెల్ల కాగితం’ అనే మరో ప్రేమకథతో వస్తున్నారు. ఈసారి కొత్త కథానాయిక, బ్యూటిఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
మరోవైపు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి అక్టోబర్‌లో రాబోతున్న మరో క్యూట్ లవ్ స్టోరీ ‘వీసా’. గల్లా అశోక్, గౌరీప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఉద్భవ్ దర్శకత్వం వహిస్తుండగా.. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంకా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న యూవీ క్రియేషన్స్ నుంచి ‘రోమియో జూలియట్’ సినిమా రాబోతోంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. ఈ చిత్రాన్ని స్వయంగా ప్రభాస్ ప్రమోట్ చేస్తున్నారు.
నెల చివరిలో డబుల్ ధమాకా..
అక్టోబర్ 30న ఒకే రోజు రెండు క్యూట్ లవ్ స్టోరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో శైలేష్ కొలన్ దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న ‘ఏమో ఏమో ఇది’ సినిమా రానుంది. అలాగే అనీష్, అనస్వర రాజన్ జంటగా వెంకీ కుడుముల నిర్మిస్తున్న ‘ఇట్లు అర్జున’ కూడా ఇదే రోజు విడుదలవుతోంది. ఈ ప్రేమకథల్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు?

