NTV Telugu Site icon

Upcoming Smartphones 2024: అద్భుత ఫీచర్లతో.. త్వరలో లాంచ్ కానున్న టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

Upcoming Smartphones 2024

Upcoming Smartphones 2024

Upcoming 5G Smartphones 2024 February and March: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఫిబ్రవరి నెలాఖరుతో పాటు మార్చి నెలలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. సూపర్ కెమెరా, మెరుగైన పనితీరు, స్టయిలిష్‌ డిజైన్‌తో కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు టాప్ బ్రాండ్‌లు సిద్ధమయ్యాయి. ప్రముఖ మొబైల్ సంస్థలు శామ్‌సంగ్, రియల్‌మీ, నథింగ్‌, షావోమీ, వివో, ఒప్పో వంటి కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. చాలా ఫోన్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మీ బడ్జెట్‌ను బట్టి స్మార్ట్‌ఫోన్‌లను కొనేసుకోవచ్చు. ఆ జాబితాను ఓసారి చూద్దాం.

Oppo F25 Pro:
ఒప్పో ఎఫ్‌25 స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి 29న విడుదల కానుంది. ఇందులో 6.7 ఇంచ్ అమోలెడ్‌ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 32 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. దీని ధర రూ.25వేలు ఉండొచ్చని అంచనా.

Nothing Phone 2a:
నథింగ్‌ ఫోన్‌ 1, నథింగ్‌ ఫోన్‌ 2తో మంచి మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్న నథింగ్‌ కంపెనీ.. 2ఏ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. మార్చి 5న ఈ ఫోన్ విడుదల కానుంది. 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14తో ఈ ఫోన్‌ రానుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 32 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా, 4800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది.

Realme 12+:
రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12ప్రో+ స్మార్ట్‌ఫోన్లను రియల్‌మీ కంపెనీ ఈ ఏడాది విడుదల చేసింది. ఇప్పుడు రియల్‌మీ 12+ పేరిట మిడ్‌రేంజ్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. మార్చి 6న ఈ ఫోన్‌ విడుదల కానుంది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5,000mAh బ్యాటరీతో రానుంది.

Vivo V30 Pro:
వివో వి30 సిరీస్‌లో ప్రో ఎడిషన్‌ను వస్తుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 28న లాంచ్‌ అవుతుంది. 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది.

Xiaomi 14:
షావోమీ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్చి 7న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 6.36 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌, 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్‌ రానుంది.

Samsung Galaxy A55 5G:
శాంసంగ్‌ నుంచి గాలక్సీ ఏ55 మోడల్‌ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటుతో ఈ ఫోన్‌ రానుంది. ఇందులో ట్రిపుల్‌ కెమెరా ఇవ్వనున్నారని తెలుస్తోంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ ఫోన్‌ రానుంది.