ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆన్-డ్యూటీ యూనిఫాం ధరించి రీల్ చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యూటీ సమయంలో పోలీసులు రీల్స్ చేయకూడదని స్పష్టం చేస్తూ గతంలో డీజీపీ అన్ని జిల్లాలకు మార్గదర్శకాలను జారీ చేశారు. అయినప్పటికీ.. పోలీస్ స్టేషన్‌లో పోస్ట్ చేసిన మహిళా పోలీసు వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. విశేషం ఏంటంటే.. ఆమె ఫాలోవర్స్ సంఖ్య 2.5 లక్షలకు పైగా ఉంది.
READ MORE: Karnataka: చేయని హత్యకు జైలు శిక్ష.. సజీవంగా భార్య.. రూ. 5 కోట్లు ఇవ్వాలని భర్త డిమాండ్..
కానిస్టేబుల్ పాలి శర్మ ఔరయ్య జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో పని చేస్తుంది. తాజాగా 21 సెకన్ల వీడియో పోస్ట్ చేసింది. ఇందులో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మీటింగ్ హాల్‌కు సంబంధించిన ఫొటో కూడా ఉంది. మరో 28 సెకన్ల వీడియో సైతం వైరల్‌గా మారింది. తన ఒడిలో ఒక చిన్న పిల్లవాడిని లాలిస్తూ వీడియో చేసింది. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాలుడితో రిల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మహిళా కానిస్టేబుల్ చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేస్తోంది. ఆమెకు పాలి భరద్వాజ్ అఫీషియల్ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది.
READ MORE: Konidela Village: పవన్ కల్యాణ్ రూ.50 లక్షల విరాళం.. కొణిదెలలో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఈ అంశంపై ఏరియా ఆఫీసర్ సదర్ అశోక్ కుమార్ స్పందించారు. “మహిళా కానిస్టేబుల్ పాలి శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు వీడియోలను పోస్ట్ చేశారు. ఒక వీడియోలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుడి బిడ్డను లాలిస్తున్నట్లు కనిపిస్తుంది. మరొక వీడియోకు అచల్దా పోలీస్ స్టేషన్‌లోని మీటింగ్ రూంలో ని ఫొటోలు వాడింది. వెంటనే గమనించిన పోలీసు సూపరింటెండెంట్ మహిళా కానిస్టేబుల్ పాలి శర్మపై శాఖాపరమైన విచారణకు సిఫార్సు చేశారు. మహిళా కానిస్టేబుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి యూనిఫాంలో పోస్ట్ చేసిన ఫోటోలను తొలగించారు.” అని ఆయన స్పష్టం చేశారు.
