UP: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బ్యూటీ పార్లర్లో వధువు హత్య
- ఉత్తరప్రదేశ్‌లో దారుణం
- బ్యూటీ పార్లర్లో వధువు హత్య
- సెకన్ల వ్యవధిలో కాల్పులు జరిపిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొద్దిసేపట్లో భర్తతో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆ వధువు సిద్ధమవుతోంది. పెళ్లి పీటలెక్కి కాబోయే భర్తతో మెడలో మూడు ముళ్లు వేసేకునేందుకు రెడీ అవుతోంది. ఎన్నో కలలు.. ఎన్నో ఊహలు.. స్నేహితులు, బంధువులు.. ఇలా ఇళ్లంతా.. మండపం అంతా సందడి సందడిగా ఉంది. ఇంకేముంది కాబోయే భర్తతో సంతోషంగా జీవితం సాగించాలని ఆ పెళ్లి కూతురు ఊహల్లో విహరిస్తోంది. కానీ తన వెన్నంటే మృత్యువు వెంటాడుతోందని ఏ మాత్రం గ్రహించలేకపోయింది. సహజంగా పెళ్లి కూతురు అంటేనే అలంకరణ. ఎంతో అందంగా వధువును సిద్ధం చేస్తుంటారు. పెళ్లి మండపంలో అందంగా కనిపించాలని కుటుంబ సభ్యులు భావిస్తుంటారు. మరింత కలర్ఫుల్గా తయారయ్యేందుకు తన స్నేహితురాండ్రతో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. కానీ అక్కడే మృత్యువు కాపు కాసింది. ఓ దుర్మార్గుడు తుపాకీతో వధువుపై కాల్పులు జరపగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అందరూ విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన యూపీలోని ఝాన్సీలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లా సోనగిరిలోని బార్గావ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల కాజల్‌కు.. యూపీలోని ఝాన్సీ గ్రామానికి చెందిన రాజ్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అయితే వివాహం కోసం కాజల్, ఆమె స్నేహితులు, బంధువులంతా ఝాన్సీ గ్రామానికి వచ్చారు. అప్పటికే నిషా గర్డెన్ కల్యాణ్ మండపంలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే పెళ్లి మండపంలోకి వెళ్లే ముందు తన స్నేహితులతో కలిసి కాజల్.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. లోపల మేకప్ వేసుకుంటుండగా.. దీపక్ అనే యువకుడు.. కాజల్‌ను బయటకు రావాలని పిలిచాడు. తనను మోసం చేశావంటూ బెదిరించాడు. కానీ కాజల్ మాత్రం బయటకు వచ్చేందుకు నిరాకరించింది. దీంతో దీపక్.. బ్యూటీ పార్లర్‌లోకి ప్రవేశించి కాజల్‌పై సెకన్ల వ్యవధిలోనే తుపాకీతో కాల్పులు జరపగా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో స్నేహితులంతా భయాందోళనతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read
- 2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
- AI manager: 17 సార్లు లేట్‌గా వచ్చాడు.. ఉద్యోగం నుంచి తీసేయాలని ఏఐ మేనేజర్ సిఫార్సు..
- David Warner: "అలా చేయడానికి వీల్లేదు".. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
- Rishabh Pant: 98 సిక్సర్లు.. ఇక 100పై కన్ను! చరిత్రకు అడుగు దూరంలో రిషభ్ పంత్
కాజల్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పార్లర్ సిబ్బంది, కాజల్ స్నేహితులు, సోదరి నేహా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకుని కాజల్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. పోలీసుల విచారణలో నిందితుడికి బాధితురాలితో పరిచయం ఉందని.. కాజల్, దీపక్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
उत्तर प्रदेश के जिला झांसी में ब्यूटी पार्लर के अंदर दुल्हन काजल की गोली मारकर हत्या। काजल की आज शादी हो रही थी। वो तैयार होने पार्लर में आई थी। शक है कि परिचित सनकी युवक (बॉयफ्रेंड) ने ये कत्ल किया होगा। pic.twitter.com/3L436WhKMC
— Sachin Gupta (@SachinGuptaUP) June 23, 2024
తాజావార్తలు
-
2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
-
Psychology Facts: ‘నాకు ఎవరికీ చెప్పాలని లేదు..’ ఈ మాట వెనుక అంతులేని వేదన!
-
AI manager: 17 సార్లు లేట్‌గా వచ్చాడు.. ఉద్యోగం నుంచి తీసేయాలని ఏఐ మేనేజర్ సిఫార్సు..
-
Heroines Exposing : పాన్ ఇండియా క్రేజ్ కోసం బోల్డ్ మేకోవర్‌లో హీరోయిన్లు
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!