UP Crime: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి నిరాకరించినందుకు ప్రియుడితో కలిసి ఓ కుమార్తె కన్నతల్లినే హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు ఇంటి నుంచి సంతకు వెళ్లిన తర్వాత ఇంట్లో తల్లి ఒక్కరే ఉన్నారని ప్రియుడిని పిలిచి ఇద్దరూ కలిసి హత్య చేశారు.
అక్క భర్తతో ప్రేమ.. తల్లి అభ్యంతరం..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కౌశాంబి జిల్లా కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్పూర్ గిర్సా గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాజమతి నవంబర్ 20న రాత్రి ఇంట్లో హత్యకు గురైంది. ఆమె చిన్న కుమార్తె శైలాజా దేవి అలియాస్ విద్యకు, ఆమె అక్క భర్త దిలీప్ కుమార్ సరోజ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, ఈ సంబంధాన్ని తల్లి రాజమతి తీవ్రంగా వ్యతిరేకించింది. దీతో తల్లిని అడ్డు తొలగించాలని శైలజ, దిలీప్ కలిసి ఆమెను హత్య చేశారు.
ఇంట్లో కుటుంబ సభ్యులు సమీపంలో సంతకు వెళ్లిన సమయంలో రాజమతి ఒంటరిగా ఉందని ప్రియుడు దిలీప్‌కు శైలజ కబురు పంపింది. సమాచారం తెలుసుకున్న దిలీప్ ఇంటికి చేరుకుని, ఇటుకతో రాజమతి తలపై పలుమార్లు కొట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య తర్వాత ఎవరికీ అనునమానం రాకుండా నిందితులు ఉపయోగించిన ఇటుకను చెరువు గట్టు వద్ద పారేశారు. రక్తపు మరకలు అంటిన తన దుస్తులు, బూట్లను శుభ్రం చేసుకుని సంతకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
సీసీటీవీలో చిక్కిన నిందితులు..
నవంబర్ 20న రాత్రి పోలీసులకు హత్య సమాచారం అందింది. డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ టీమ్‌లో ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. ఈ కేసు కోసం మూడు టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ నిఘా, సీసీటీవీ ఫుటేజ్, స్థానికులను విచారించడం ద్వారా నిందితులను గుర్తించారు. నిందితులు దిలీప్, శైలజనను అరెస్ట్ చేశారు.

