Site icon NTV Telugu

Yogi Adityanath: కాబోయే పీఎం యోగి ఆదిత్యనాథ్‌..? ఆయన భవిష్యత్తు ఎలా ఉందంటే..

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: ఉగాది పర్వదినం రోజు పంచాగం చెబుతుంటారు పండితులు.. తెలుగు సంవత్సరాదిన పంచాగం మారిపోయి.. ఎవరికి ఎలా ఉండబోతోంది? ఏ రాశివారికి ఎలా కలిసిరానుంది..? ఆదాయం, వ్యయం.. ఇలా అనేక విషయాలు వెల్లడిస్తారు.. ఈ సందర్భంగా ఎన్టీవీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో.. భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయనది వృషభ రాశి.. 1971 డిసెంబర్‌ 29వ తేదీన ఆయన జన్మించారు.. ఆయనకు గజకేసరి యోగం ఉంది.. ఇక, పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన.. ఆయనకు నిజాయితీ ఎక్కువగా ఉంటుంది.. అయితే, గజకేసరి యోగం వలనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.. ఇప్పుడు ఆయనకి శని మహా దశలో శని అంతర్‌దశ నడుస్తోంది.. 2023 ఏప్రిల్‌ నుంచి ఒక ఏడాది పాటు ఆయనకు బాగా ఉండదని.. కానీ, 2025లో ఆయనకు మంచిగా ఉంది.. భవిష్యత్‌లో ఆయన భారత ప్రధాని అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Exit mobile version