Site icon NTV Telugu

UP: ఛీ ఛీ.. పని మనుషులు ఇలా కూడా చేస్తారా..? సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డ దుశ్చర్య..(వీడియో)

Up

Up

UP: పనిమనిషిని ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వారి వ్యక్తిత్వం, గుణగణాలను చెక్ చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్లని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో పనిమనిషి చేసిన ఓ అసహ్యకరమైన చర్య బయటకు వచ్చింది. బిజ్నోర్ జిల్లాలోని నాగినా పట్టణంలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా ఒక వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి చేసిన సిగ్గుచేటు చర్య కెమెరాలో రికార్డైంది. ఆ మహిళ వంటగదిలోని గ్లాసులో మూత్ర విసర్జన చేసి, కడిగిన పాత్రలపై చల్లింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆమె పేరు 55 ఏళ్ల సమన్నాగా గుర్తించారు.

READ MORE: Supari Gang : మళ్లీ సూర్యాపేటలో సుపారీ మర్డర్ యత్నం

వీడియో, బాధితుల కథనం ప్రకారం.. వ్యాపారవేత్త సత్యం మిట్టల్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. వీరు ఓ మహిళా పనిమనిషిని నియమించుకున్నారు. ముందు బాగానే ఉన్నా.. కొంత కాలంగా పనిమనిషి తీరు సరిగ్గాలేదని మిట్టల్ కుటుంబీకులు గమనించారు. పనిమనిషి కార్యకలాపాలపై అనుమానం వ్యక్తం చేశారు. అందుకే వారు ఇంటి వంటగదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండ్రోల కిందట(బుధవారం) రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోలో పనిమనిషి పాత్రలు కడిగి పక్కన పెట్టింది.. అనంతరం ఓ గ్లాసులో మూత్రం పోసి ఆ కడిగిన పాత్రలపై చల్లుతున్నట్టు కనిపించింది. ఈ వీడియో చూసినట కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫుటేజీ అందించారు. ఆ పనిమనిషిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా.. నిందితురాలు తన తప్పును అంగీకరించింది. కానీ కారణం చెప్పడానికి నిరాకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version