Site icon NTV Telugu

Congress: సైనిక స్కూళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు.. రాష్ట్రపతికి లేఖ

Cke

Cke

సార్వత్రిక ఎన్నికల వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. దేశంలోని సైనిక్‌ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని.. ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఖర్గే కోరారు.

ఇది కూడా చదవండి: Ramadan 2024: రంజాన్ వేడుకల్లో మహిళా మంత్రులు.. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు

రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ ద్వారా దేశంలో 33 సైనిక్‌ స్కూళ్లు పనిచేస్తున్నాయని ఖర్గే గుర్తుచేశారు. ఇంతవరకు సైనిక దళాలు, వాటి అనుబంధ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయని… ప్రైవేటీకరిస్తే వాటి స్వభావంపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఒక సిద్ధాంతాన్ని విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నించడం తగదని హితవు పలికారు. దేశ సేవకు కావాల్సిన లక్షణాలను, దార్శనికతను ఈ పాఠశాలల్లోని విద్యార్థులు నిలుపుకోవాలంటే ప్రైవేటీకరణ ఒప్పందాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు. లేదంటే 62% పాఠశాలల్ని బీజేపీ-ఆరెస్సెస్‌ నేతలే సొంతం చేసుకుంటారని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. కాబట్టి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని.. అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి: Weather update: వాతావరణ శాఖ తాజా సూచనలు.. హెచ్చరికలు ఇవే

కాంగ్రెస్ ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఏ రాజకీయ, సైద్ధాంతిక సంస్థలు ఈ ఎంపిక ప్రక్రియ ప్రభావితం చేయవని తెలిపింది. దీనికి సంబంధించి వచ్చిన ఆరోపణలు అసంబద్ధమైనవని.. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఖండించింది. విద్యారంగంలో అనుభవం ఉన్న సంస్థలతో 100 పాఠశాలలను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని తెలిపింది. కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా 500 దరఖాస్తులను స్కాన్‌ చేయగా.. 45 పాఠశాలలకు మాత్రమే ఆమోదం లభించిందని పేర్కొంది. అది కూడా తాత్కాలికమేనని, వాటిపై పర్యవేక్షణ ఉంటుందని కేంద్రం వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Ramadan 2024: రంజాన్ వేడుకల్లో మహిళా మంత్రులు.. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు

Exit mobile version