Site icon NTV Telugu

Unstoppable With NBK : బాలయ్య షో లో సీనియర్ స్టార్ హీరోయిన్స్ సందడి.. అదిరిపోయే స్టెప్స్ తో ఆకట్టుకున్న బాలయ్య..

Whatsapp Image 2023 12 15 At 12.09.48 Am

Whatsapp Image 2023 12 15 At 12.09.48 Am

నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో తో యాంకర్‏గా మారిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో హోస్ట్ గా బాలయ్య అదరగొట్టేశారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది.ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన బాలయ్య.. ఈ షోలో తనదైన కామెడీ టైమింగ్.. పంచులతో అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నారు.. ఈ షోకు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా అతిథులుగా వచ్చి సందడి చేస్తున్నారు.ఇప్పటివరకు రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు . స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, సుహాసిని మణిరత్నం, శ్రియా శరన్ మరియు జయంత్ సి.పరాన్జీ మూడవ ఎపిసోడ్ కు అతిథులుగా వచ్చారు. ఈ నలుగురిలో ముగ్గురితో కలిసి బాలకృష్ణ పనిచేశారు. బాలకృష్ణ, సుహాసిని జంటగా అనేక సినిమాల్లో నటించారు.

అలాగే బాలయ్య, శ్రియా కలిసి ఏకంగా మూడు సినిమాల్లో నటించారు.ఇక జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అయితే బాలయ్య ఏకంగా రెండు సినిమాలు చేశారు. ఇక డైరెక్టర్ హరిష్ శంకర్ తో మాత్రం బాలయ్య ఇంకా వర్క్ చేయలేదు. కానీ ఇప్పుడు అన్ స్టాపబుల్ షోలో వీరిద్దరూ తమ కామెడీ పంచులతో నవ్వులు పూయించారు. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌పై బాలకృష్ణ తనదైన స్టైల్లో పంచులను విసిరి స్టేజ్‌పై నవ్వులను పూయించారు..ఆ తరువాత బాలకృష్ణతో సుహాసిని మరియు శ్రియాశరన్ డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. చెన్న కేశవ రెడ్డి లోని హాయి హాయి పాటకు శ్రియా, బాలయ్య అదిరిపోయే స్టెప్స్ తో అదరగొట్టారు.. డిసెంబర్ 22న ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఎపిసోడ్ 3 స్ట్రీమింగ్ కానుంది.ఎంతో ఎంటర్టైన్మెంట్ తో సాగిన ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Exit mobile version