NTV Telugu Site icon

Rains : తమిళనాడును ముంచెత్తిన వానలు.. స్కూళ్లు బంద్

Rains

Rains

Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన కారణంగా తమిళనాడులో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వానలు కొద్ది రోజులు పడే అవకాశం ఉంది. దీంతో నాగపట్టినం, తిరువరూర్‌ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కాగా, నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకలోని బట్టికలోవాకు 60 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడులోని కరైకల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

Read Also: Security Guard : ఓనర్‎ను కత్తితో పొడిచిన సెక్యూరిటీ.. అలా చేశాడన్న కోపంతో దారుణం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమై గురువారం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు పక్కరాష్ట్రాలైన పుదుచ్చేరి, కరైకల్‌, ఉత్తర తమిళనాడులోని ఒకటీరెండు చోట్ల భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.

Read Also: Shakuntalam: ఇంతమంచి పాట తెలుగులో విని చాలా కాలమే అయ్యింది…