Hyderabad Metro: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జరుగుతుండడంతో పండుగా వాతావరణం నెలకొంది. నగర వాసులంతా ఓట్లేసేందుకు తమ తమ సొంత గ్రామాలకు పెద్ద ఎత్తున్న తరలి వెళ్లారు. గ్రామగ్రామాన పోలింగ్ ప్రక్రియ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలంతా ఓటేయడానికి గ్రామాలకు తరలి పోవడంతో హైదరాబాద్ మహానగరం బోసిపోయింది. ముఖ్యంగా రోజూ కిక్కిరిసిపోయే హైదరాబాద్ మెట్రోలో అనూహ్య పరిస్థితి నెలకొంది. నేడు ప్రయాణిస్తున్న మెట్రో ట్రైన్లు కరోనా కాలం నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు నేడు దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
#METROHYDERABAD pic.twitter.com/F8ByNjHlN9
— Sai vineeth(Journalist🇮🇳) (@SmRtysai) November 30, 2023
