Artificial Intelligence : విదేశాల్లో ఉన్నత చదువులంటే విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతారు. పైగా పేరున్న యూనివర్సిటీలు, విద్యాసంస్థలు అయితే ఇంకా గర్వంగా ఫీలవుతారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లల్లో విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే భయపడిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇపుడు ఆ భయం నుంచి బయటికొచ్చేశారు. ప్రస్తుత తరుణంలో ఇండియాలోని చాలా మంది విద్యార్థలు వివిధ దేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడానికి సుముఖత చూపుతున్నారు. కొన్ని దేశాలు అయితే ఏకంగా భారత విద్యార్థులు తమ దేశంలో చదువుకోవడానికి ఎన్నో ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన భారత దేశంలో మాట్లాడే హిందీ భాషలో వేరే దేశంలోని యూనివర్సిటీ కోర్సును ప్రారంభించింది. అది ఎక్కడంటే..
Read Also: Artificial Intelligence : ఏఐతో భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు.. ఆది నుంచే నియంత్రించాలంటున్న మేధావులు
స్కాట్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ తొలిసారిగా హిందీ లో ఒక ఓపెన్ యాక్సెస్ కోర్సును ప్రారంభించింది. ది క్లైమేట్ సొల్యూషన్స్ అనే కోర్సును ఇంగ్లిష్, అరబిక్‌తో పాటు హిందీలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూనివర్సిటీ ప్రకటించింది. ఎడిన్‌బర్గ్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం భాగస్వామ్యంతో ఈ కోర్సును అభివృద్ధి చేసినట్టు వర్సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నప్పటికీ.. ఎప్పటి నుంచి అడ్మిషన్లు తీసుకోనున్నారు.. అందుకు సంబంధించిన అర్హతలేంటే పూర్తి వివరాలను యూనివర్సిటీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
