NTV Telugu Site icon

University Grants Commission: యూజీసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి అది నిలిపివేత

Ugc

Ugc

University Grants Commission: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మార్కుల షీట్, ప్రొవిజినల్ సర్టిఫికేట్లపై ఆధార్ నంబర్ ను ముద్రించడానికి వీలు లేదని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు సర్టిఫికేట్లపై ఆధార్ నంబర్ ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రవేశాలు, రిక్రూట్‌మెంట్ల విష‌యంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, కొన్ని సంస్థలు ఆధార్ నంబ‌ర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల ప‌రిధిలోని యూనివ‌ర్సిటీలు విద్యార్థుల డిగ్రీలు, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబ‌ర్లు ముద్రిస్తున్నారు. దీని ద్వారా వ్యక్తిగత సమాచారం బయటకు వెళుతుందని భావించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అలా ముద్రించడం నిలిపివేయాలని ఆదేశించింది. విద్యార్థుల ప్రైవేట్ డేటాబేస్‌ను పబ్లిక్ చేయడం ఆమోదయోగ్యం కాదని యూజీసీ సెక్రటరీ ప్రొ. మనీష్ ఆర్. జోషి వెల్లడించారు.

Also Read: Telia Bhola Fish: రాత్రికి రాత్రే మారిన జాలర్ల జాతకం.. ఆ ఒక్కటి వారి జీవితాన్ని మార్చేసిందిగా

ఈ మేరకు అన్ని యూనివర్సిటీలకు లేఖలు రాశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను UGC అధికారిక వెబ్‌సైట్ ugc.gov.in లో ఉంచింది. ఈ వెబ్ సైట్ లో నోటీసులు జారీ చేసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సూచించిన గైడ్ లైన్స్ ను ఫాలో కావాల్సిందేనని యూజీసీ యూనివర్శిటీలకు తేల్చి చెప్పంది. అందుకే విద్యార్థుల వివరాలను బహిర్గతం చేసే వివరాలను వెల్లడించకూడదని యూజీసీ ఆదేశించింది. ఇప్పటే ఆధార్ విశిష్ట నంబర్ ను అన్ని సంక్షేమ పథకాల లబ్దికోసం, అప్లికేషన్ల కోసం, రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో గుర్తింపు కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికతను నిర్థారణ చేసుకోవడానికి కూడా ఆధార్ నంబర్ ను ఉపయోగిస్తు్న్నారు. ఇక దేశంలో ఉన్న అన్ని యూనివర్శిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆధీనంలో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్క యూనివర్శిటి యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం యూజీసీకి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ సంస్థ ఆదేశించినట్లు విద్యార్ధుల ప్రొవిజనల్స్, మార్క్ లిస్ట్ పై ఆధార్ కార్డు నెంబర్ ను ముద్రించడం వెంటనే నిలుపుదల చేయాలి. లేదంటే అలాంటి యూనివర్శిటీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.