Wedding Tradition: ప్రస్తుత రోజుల్లో వివాహం అంటే పెద్ద వ్యవహారమే జరుగుతుంది. ప్రజలు వారి స్తోమతకు మించి నలుగురిలో మెప్పును పొందేలా హంగు ఆర్భాటాలతో పిల్లల వివాహాలను జరపడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా పెళ్లి ఖర్చును లక్షలను దాటి కోట్లలో పెళ్లిళ్లకు ఖర్చు చేస్తున్నారంటే నమ్మండి. పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో పెళ్లి తంతు ఒక్కోవిధంగా జరుగుతూ ఉంటుంది. అందులోనూ మళ్లీ అమ్మాయి, అబ్బాయిల కుటుంబాలకు సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ విచిత్రమైన ఆచారం సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దామా..
పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధానికి పునాది. రెండు కుటుంబాల మధ్య బంధుత్వానికి వారధి. అందుకే పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇకపోతే ఈ పెళ్లి సమయంలో కొందరు వరుడికి వధువుతో పాటు భారీగా కట్నకానుకలు ఇస్తారు. అది చట్టబద్దం కాకపోయినా.. అందరూ అనుసరించేదే. ఇక అసలు విషయంలోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లాలని బూచుపల్లి వంశీయులు పెళ్లిల్లో మాత్రం కథ వేరేలా ఉంటుంది. పెళ్లి మొత్తం తతంగంతో పాటు పెళ్లికొడుకుకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం ఆచారం.
Danish Malewar: దేశవాళీ క్రికెట్‌లో నయా సెన్సేషన్.. దులిప్ ట్రోఫీలో మలేవర్ సంచలన ఇన్నింగ్స్!
మరి ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే.. నిజానికి వధువు, వరుడు తలపై జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తాలికట్టి తలంబ్రాలు పోవడంతో పెళ్లి తంతు ముగుస్తుంది. కానీ, బూచ్చుపల్లి వంశీయుల పెళ్లి ఇంతటితో ముగియదు. వీటన్నిటితో పాటు పెళ్ళికొడుకుని కొరడాతో మూడు దెబ్బలు కొట్టిన తర్వాతే వివాహం పూర్తయినట్లు భావిస్తారట. పెళ్లి పీటలపై వధువు మెడలో వరుడు తాలి కట్టిన తర్వాత అతని కుటుంబ సభ్యులు కొరడాతో మూడు దెబ్బలు వేస్తారట.. ఈ కొట్టే ఆచారం వీరి వంశంలో తరతరాలుగా వస్తుందట.
ఇక ఈ ఆచారం ఎలా మొదలైందంటే.. వందల ఏళ్ల క్రితం బూచుపల్లి వంశీయులు గంగమ్మ ఆలయం నుంచి ఓ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారట. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో 5 కొరడాలు ఉన్నాయట. వెంటనే ఆ వంశీయులు ఆలంలోకి వెళ్లి గంగమ్మను తప్పు జరిగిందని క్షమించమని వేడుకున్నారట. దీంతో గంగమ్మ ప్రత్యక్షమై మీ వంశీయులు వివాహ సమయంలో పెళ్లికొడుకుకి మూడు దెబ్బలు కొట్టాలని చెప్పిందట. ఇక అంతే.. అప్పటినుంచి ఆ ఆచారాన్ని వారి వంశంలో జరిగే ప్రతి పెళ్లిల్లోనూ కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు వారి వంశంలో వెయ్యికి పైగా పెళ్లిళ్లు జరగగా.. పెళ్లి సమయంలో నేటికి ఈ ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.
జియో, ఎయిర్‌టెల్‌కు BSNL షాక్.. రోజుకు కేవలం రూ.5లతో అన్‌లిమిటెడ్ కాల్స్!
