NTV Telugu Site icon

RK Singh : అక్షయ యోజన కార్డు ద్వారా 5 లక్షల ద్వారా ఉచిత చికిత్స

Rk Singh

Rk Singh

పేద ప్రజల కోసమే భారత్ వికాసిత్ భారత్ సంకల్పయాత్ర అని అన్నారు జనగామ జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. దేశంలో ఈ పథకం ద్వారా మూడు కోట్ల ఇల్లు మంజూరు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఈ పథకం అమలు చేయడం జరిగింది, తెలంగాణలో ఇంకెవరైనా ఈ పథకం ద్వారా లబ్ధి పొందని వారు మరోసారి కూడా లబ్ధి పొందవచ్చన్నారు ఆర్కే సింగ్‌. పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకు ఆరోగ్యం, అక్షయ యోజన కార్డు ద్వారా 5 లక్షల ద్వారా ఉచిత చికిత్స అందించనున్నట్లు తెలిపారు. మొత్తం భారతదేశంలో 18 కోట్ల మంది ప్రజలకు నల్ల ధర నీళ్లు అందిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

రెండు కోట్ల మంది పేద ప్రజలకు విద్యుత్ ద్వారా వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపినమన్నారు. ఎవరైనా నూతనంగా వ్యాపారం చేసుకునే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎటువంటి గ్యారెంటీ లేకుండా స్టాండప్ ఇండియా ద్వారా గ్యారెంటీ లోన్ మంజూరు చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమ యొక్క ముఖ్య ఉద్దేశమని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు నిరుపేదలకు అందుతున్నాయా లేదా తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎవరికైనా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందకపోతే మీరు వినతులు ఇచ్చుకోవచ్చన్నారు. ప్రపంచంలోనే భారతదేశం ఇప్పటికే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది ఇలాగే కొనసాగితే మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతామని, అందరం చేతులు కలిపితే భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలబెడతామన్నారు.