NTV Telugu Site icon

Bhogapuram Airport: ఏది ఏమైనా 2026కి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి..

Ram Mohan Naidu

Ram Mohan Naidu

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ టెర్మినల్, రన్ వే తదితర నిర్మాణాలను పరిశీలించిన ఆయన.. జాతీయ రహదారితో విమానాశ్రయ అనుసంధాన రహదారిపై కూడా ఆరా తీశారు.. విమానాశ్రయ నిర్మాణ పనులను జి.ఎం.ఆర్. సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఎంపీ అప్పల నాయుడు, శాసన సభ్యులు లోకం నాగ మాధవి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.. ఇక, ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. జూన్ 9న పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శించడం జరిగింది.. ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే ఈ ఎయిర్ పోర్టు పూర్తి చేసుకోవాలి.. ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.. పదవి చేపట్టిన తర్వాత ఢిల్లీలో సివిల్ ఏవియేషన్ తరుపున మీటింగ్ పెట్టుకున్నాం.. కానీ, క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఈ రోజు వచ్చాం అని వెల్లడించారు.

Read Also: Rythu Bharosa Conferences: రేపట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సదస్సులు.. 22 వరకు వర్క్ షాప్

ఇక, గత టీడీపీ ప్రభుత్వంలో 2015 లో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.. 2019 నాటికి కూడా టెండర్ ప్రోసెస్ చేయడం జరిగింది అని గుర్తుచేశారు రామ్మోహన్‌నాయుడు.. అయితే, గత వైసీపీ ప్రభుత్వంలో చాలా ఆలస్యం జరిగిందన్నారు. డిసెంబర్ 26 నాటికి పూర్తిగా చేస్తమని చెప్తున్నారు.. కానీ ఆరు నెలలు ముందే కంప్లీట్ చేయాలని అదేశించాం.. అందుకు ఏమైనా సమస్యలు అంటే నా దృష్టిలో తీసుకు రావొచ్చు.. ఏది ఏమైనా 2026కి ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇరువురూ నేతలు ఉత్తరాంధ్రను అభివృద్ది చేయాలని చూస్తున్నారు.. ఏపీని ప్రపంచం పటంలో పెట్టడానికి కృషి చేస్తున్నారు.. ఈ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా 6 లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Read Also: Sanjana: అర్థరాత్రి వీఐపీ కొడుకు అసభ్యకరమైన మెసేజులు.. సంజన సంచలన వ్యాఖ్యలు

వలస జిల్లాలుగా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం నుండి ఎక్కువ మంది వలస వెళ్తున్నారు.. ఆ పరిస్థితిని మార్చాలంటే ఇలాంటి అభివృద్ది కార్యక్రమాలకు పునాది వేయాలన్నారు రామ్మోహన్‌నాయుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ నెల11 తేదీన ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనుల విజిట్ కు వస్తున్నారు.. సివిల్ ఏవియేషన్ తరుపున ఏ అవసరం వచ్చినా వెంటనే క్లియర్ చేస్తాం.. టాప్ ప్రయార్టి కింద ఈ ఎయిర్‌పోర్ట్‌ని తీసుకుంటున్నా.. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో యేడాదికి 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.. కానీ, భోగాపురంలో మొదటి ఏడాది లోనే 50 లక్షల మంది ప్రయాణించనున్నారని పేర్కొన్నారు. 60 లక్షల మంది టెర్మినల్ కేపసిటీ గా నిర్మాణం చేపట్టాం.. 50 ఏళ్లకు పైగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిర్మాణం చేస్తున్నాం.. విశాఖ నుండి శ్రీకాకుళం వరకు బీచ్ రోడు ను కనెక్ట్ విటి చేస్తామని.. ఎన్డీఏ కూటమిని ఏ విధంగా అయితే ఆశీర్వదించారో.. అందుకు తగ్గట్టు మేం కూడా పని చేస్తాం అన్నారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు గత ఐదేళ్లలో ముందుకు సాగ లేదు. వాటి పైన పూర్తి దృష్టి పెడతాం.. గతంలో రేపు.. ఎల్లుండి.. అనే విధంగా వాయిదా వేశారు.. ఈ ప్రాంతం నుండి ఏవియేషన్ మంత్రిగా నేను, కన్స్ట్రక్ట్షన్ యజమానిగా జీఎంఆర్ ఇద్దరం ఉన్నాం.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటి పై దృష్టి పెడతాం అన్నారు. దేశంలో ఎయిర్ ట్రావెల్ మీద డిమాండ్ పెరిగింది.. 2014 లో 70 ఎయిర్ పోర్టులు ఉంటే.. ఇప్పుడు 157 ఉన్నాయి.. ఇంకో 37 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి.. డిమాండ్ ఉన్నా.. ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రం మనకు తగినన్ని అందుబాటులో లేవు అని వెల్లడించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.