NTV Telugu Site icon

Koti Deepotsavam Day 10: వైభవంగా కోటి దీపోత్సవం.. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam Day 10: కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. రోజుకో అనుగ్రహ భాషణం, పీఠాధిపతుల ప్రవచనాలు, కల్యాణం, వాహనసేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం కళకళలాడిపోతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌ మహా నగరం సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే తొమ్మిది రోజులు విజయవంతంగా ముగిశాయి. కోటి దీపాల పండుగ.. కోటి దీపోత్సవం నేటితో పదో రోజు ఘనంగా ప్రారంభమైంది. కార్తిక మూడో సోమవారం శుభవేళ కోటి దీపోత్సవ వేడుకకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ హాజరుకానున్నారు. నిర్వాహకులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలకనున్నారు. రాజ్‌నాథ్ సింగ్ రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి స్వామివారికి పూజలు నిర్వహించి, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపాలను వెలిగించనున్నారు.

నేడు కార్తీక మూడో సోమవారం. ఈ ప్రత్యేక రోజున కోటి దీపోత్సవంలో జరిగే విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. నేడు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామీజీ, శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై కాశీ జ్యోతిర్లింగ మహాపూజ జరగనుంది. భక్తులచే శివలింగాలకు కోటి పుష్పార్చన జరగనుంది. కాశీ శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి కల్యాణం ఉంటుంది. నంది వాహన సేవ ఉంటుంది.