NTV Telugu Site icon

Secunderabad – Vasco Digama Train: గోవా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచే కొత్త రైలు..

Train

Train

రేపు సికింద్రాబాద్ – వాస్కోడిగామా మధ్య కొత్త ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రైలు హైదరాబాద్ నుంచి కర్ణాటక , గోవాకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండనుంది. సికింద్రాబాద్ నుంచి గోవా వాస్కోడిగామాకు ఈ కొత్త ట్రైన్ 20 గంటల్లో చేరుకుంటుంది. ఉదయం 11గంటల 45 నిమిషాలకు బయలు దేరి మరుసటి రోజు 7గంటల 20 నిమిషాలకు గోవా వాస్కోడగామాకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి బయలు దేరే ఈ స్పెషల్ ట్రైన్ రైలు కాచిగూడ, షాదర్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, గద్వాల, కర్నూల్‌ సిటీ, డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్‌పేట్‌, కొప్పల్‌, గదడ్‌, హుబ్బలి, దర్వాడ్‌, లోండా, మడగాన్‌ మీదుగా మొత్తం 20 స్టేషన్లలో ఆగుతూ గోవాకు వెళ్తుంది. టూరిజం కోసం గోవాకు వెళ్లే వారు ఈ ట్రైన్స్ సర్వీసును ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎల్ హెచ్ బీ కోచ్ లతోపాటు ఏసీ, నాన్ ఏసీ సౌకర్యాలు ఈ స్పెషల్ ట్రైన్ లో ఉన్నాయి..

READ MORE: Indrakiladri: వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారం దుర్గమ్మ దర్శనానికి రావాలి..

ఇదిలా ఉండగా.. దసరా నుంచి వచ్చే పండగలను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే చాలా స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు అక్టోబర్ రెండు నుంచే సర్వీస్‌లు ప్రారంభించింది. దాదాపు నెల రోజుల పాటు అంటే నవంబరు ఏడో తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రవైపు ఎక్కువ రైళ్లు వేశారు. సికింద్రాబాద్‌- శ్రీకాకుళం రూట్‌లో 12 ప్రత్యేక రైళ్లు రన్ చేస్తున్నారు. ప్రతి బుధ, గురువారాల్లో ఈ ప్రత్యేక రైల్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి.