Site icon NTV Telugu

Kishan Reddy: అంబేద్కర్తో అనుబంధం, సంబంధం ఉన్న ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దారు..

Kishan

Kishan

Kishan Reddy: అంబేద్కర్ జయంతి సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద్రాభంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మాటలతో విరుచుక పడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ హత్య చేసిందని.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఘోరి కట్టారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో పని చేస్తున్నామని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాజ్యాంగం చెక్కు చెదరలేదని.. అది అంబేద్కర్, దేశ ప్రజలు గొప్పతనం అని ప్రసంగించారు.

అలాగే 75 సంవత్సరాలుగా రాజ్యాంగానికి తూట్లు పొడవాలని కాంగ్రెస్ చూసిందని, అంబేద్కర్ ను ఓడించేందుకు అయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నికృష్టమైన మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది అని విరుచుకపడ్డారు. అయన చనిపోతే అయన పార్థివ దేహం తరలించిన విమానం ఛార్జ్ లను కూడా ఆయన భార్య దగ్గర వసూలు చేసిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. ఎవరెవరికో భారత రత్న ఇచ్చుకున్నారు.. అంబేద్కర్ కు మాత్రం ఇవ్వలేదు.. చివరకు బీజేపీ చొరవతో ఆయనకు భారత రత్న వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక అంబేద్కర్ తో అనుబంధం, సంబంధం ఉన్న ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దారని, పంచ తీర్థగా అభివృద్ధి చేశారని తెలిపారు. అంబేద్కర్ ను మతం మార్చుకోవాలని ఎంత ఒత్తిడి చేసిన అయన ఆ మతం లోకి మారలేదని ఆయన అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ను ముంబై లో పెట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Exit mobile version