Site icon NTV Telugu

Union Minister Kishan Reddy: ఈముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ..

Kishan Reddy

Kishan Reddy

Union Minister Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.. వరంగల్ కోట భూములను ASIకి చెందినవిగా గుర్తిస్తూ రెవెన్యూ రికార్డులను సవరించాలని లేఖలో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే తొలగించాలని కోరారు. ఆక్రమణదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వారసత్వ సంపద పరిరక్షణలో ASI కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని.. 250 ఏళ్లపాటు కాకతీయుల రాజధానిగా విరాజిల్లిన వరంగల్ కోట, మన చారిత్రక వైభవానికి, శౌర్య పరాక్రమాలకు నిదర్శనమన్నారు.

READ MORE: Alpamayoతో కలిసి Nvidia సెల్ఫ్-డ్రైవింగ్ కార్లకు ‘రీజనింగ్ AI’.. రోడ్డు ప్రమాదాలకు చెక్ పడినట్టే!

కోట రక్షణ కోసం నిర్మించిన 7 ప్రాకారాలలో ప్రస్తుతం 3 మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. “స్థానికులు కోట భూములను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారని, ప్రైవేట్ వ్యక్తులు మట్టి గోడలను సైతం ధ్వంసం చేస్తున్నారని ఏఎస్ఐ (ASI) గుర్తించింది. రెవెన్యూ రికార్డులలో ఈ భూములు ‘ప్రభుత్వ భూమి’గా ఉన్నాయని, వాటిని ‘భారత పురావస్తుశాఖ (ASI)’ భూములుగా మార్చకపోవడం వల్ల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడం కష్టమవుతోంది.. ఆక్రమణలను తొలగించాలని ASI అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అలాగే 2022-2025 సంవత్సరాల్లో జిల్లా కలెక్టరుకు లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.” అని లేఖలో పేర్కొన్నారు.

READ MORE: CES 2026: 10 నిమిషాల ఛార్జింగ్‌తో 300KM రేంజ్.. ప్రపంచంలోనే మొట్టమొదటి సాలిడ్-స్టేట్ బ్యాటరీ బైక్ ఆవిష్కరణ

Exit mobile version