NTV Telugu Site icon

Kishan Reddy: ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా?.. ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్రమంత్రి ఆగ్రహం

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చిన ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అని తీవ్రంగా మండిపడ్డారు. కార్యాలయంలోపలికి వస్తే బాగోదని హెచ్చరించారు. ప్రగతి భవన్, తెలంగాణ భవన్‌లో ఐబీ వాళ్లను పెడతా.. ఒప్పుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ రాష్ట్ర ఇంటలిజెన్స్ వారికి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయిస్తా అంటూ తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

Komatireddy Venkat reddy: వీఆర్‌ఏ సమస్యను పరిష్కరించని వాళ్లు.. దేశంలో పార్టీ పెట్టి ఏం చేస్తారు?

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్, సునీల్ బన్సల్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. భారతీయుల ఆత్మ గౌరవం పెంచాలని గాంధీ పెంచాలని నాడు గాంధీ చెప్పారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. గాంధీ ఆశయాలు నెరవేర్చడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. లోకల్ టూ వోకల్ నినాదంతో యుద్ధ విమానాల నుంచి వ్యాక్సిన్ వరకు మన దేశంలోనే తయారు చేస్తుందన్నారు. దేశంలో చేనేత రంగం కుదేలు అవుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. చేనేత వస్త్రాలు ధరించాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాలే కాదు బీజేపీ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తోందన్నారు.