NTV Telugu Site icon

Parliaments Session: ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. 24న ఆల్‌ పార్టీ మీటింగ్‌

Parlament

Parlament

Parliaments Session: ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 20వ తేదీ వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది. నవంబర్‌ 24న ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌ హౌస్‌ అనెక్స్‌లో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ఈరోజు (మంగళవారం) తెలిపారు. పార్లమెంట్‌ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లను సభా వ్యవహారాలపై చర్చించేందుకు సెంట్రల్ సర్కార్ మీటింగ్ కు ఆహ్వానించింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్ సెషన్స్ లో చర్చించే ఛాన్స్ ఉంది.

Read Also: Tecno Pop 9 Launch: ‘టెక్నో పాప్ 9’ వచ్చేస్తోంది.. ధర 10 వేల కంటే తక్కువే!

ఇక, నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అలాగే, రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో ఈ నెల 26వ తేదీన ప్రత్యేక వేడుకలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాగా ఇప్పటి వరకూ నవంబర్‌ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తుండేవారు. కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి నవంబర్‌ 26వ తేదీని మోడీ సర్కార్ రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తుంది.

Read Also: Justice Sanjiv Khanna: ఢిల్లీలో వాయు కాలుష్యం.. వర్చువల్‌గా కేసుల విచారణ

మరోవైపు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలు, వక్ఫ్‌ సవరణ బిల్లు లాంటి మొదలైనవి సభ ముందుకు రానున్నాయి. ఈ సెషన్స్ లోనే వక్ఫ్‌ సవరణ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఇంకోవైపు, జమిలి ఎన్నికలు, వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అధికార, విపక్షాలు సభ్యుల మధ్య పార్లమెంట్‌లో వాడి వేడి చర్చ కొనసాగే ఛాన్స్ ఉంది.