NTV Telugu Site icon

Cancer Vaccine: ఐదారు నెలల్లో క్యాన్సర్ టీకా.. వారికి మాత్రమే అందిస్తామన్న కేంద్ర మంత్రి

Cancer Vaccine

Cancer Vaccine

మహిళల్లో క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మహిళలను వేధిస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ అన్నారు. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు అందిస్తామన్నారు. మంగళవారం ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీకాపై పరిశోధన పనులు దాదాపు పూర్తయ్యాయని, పరీక్షలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

READ MORE: Pawan Kalyan: మహకుంభమేళాలో పుణ్యస్నానం చేసిన పవన్ దంపతులు

జాదవ్ మాట్లాడుతూ.. “దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంది. 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి ‘డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు’ ఏర్పాటు చేస్తాం. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే.. మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్‌ వ్యాక్సిన్‌పై పరిశోధన దాదాపు పూర్తయింది. పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇది ఐదు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల వయస్సు గల బాలికలు టీకాకు అర్హులు అవుతారు. ఇది రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్‌లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.” అని తెలిపారు.

READ MORE: Fact Check: రోహిత్ శర్మకు పాకిస్థాన్‌లో కూడా అంత క్రేజ్ ఉందా? ఈ వైరల్ వీడియోలో నిజమెంత?