తిరుపతి గాంధీభవన్ లో ఘనంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నిధులు ఆపేస్తాం అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టాకుండా జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటూన్నారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Women Big Bash League: బ్యాట్ విరిగినా, బాల్ సిక్స్ వెళ్లింది.. వీడియో ఇదిగో
కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇకపై ప్రధాని ఫోటో పెట్టకుండా పథకాలు అమలు చేస్తే కేంద్రం ఇచ్చే నిధులు ఏపీ ప్రభుత్వానికి నిలుపుదల చేస్తామన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇదే మా చివరి హెచ్చరిక అంటూ ఆయన తెలిపారు. ఎక్కడా కూడా కేంద్రం ఇస్తున్నట్టు తెలియజేయటం లేదు అని ఆయన మండిపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే నా శాఖ పరిధిలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు.