జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలన యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాంక్షిత జిల్లాలు, మండలాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు చేరడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని బండి సంజయ్ తెలిపారు. అభివృద్ధి కాని ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలి.. అభివృద్ధి అయిన ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. దేశంలో 112 వెనుకబడిన జిల్లాలను, దేశవ్యాప్తంగా 500 మండలాలను నీతి అయోగ్ గుర్తించిందని తెలిపారు. ప్రజలందరినీ సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తామని కేంద్రమంత్రి పేర్కొ్న్నారు. మరోవైపు.. జిల్లాలో సంపూర్ణత అభియాన్ విజయవంతంగా సాగుతుందని బండి సంజయ్ చెప్పారు.
Read Also: Explosion In IOCL: ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు
అనంతరం మహముత్తారం మండలంలో పర్యటించారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శనను తిలకించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫలాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మోడీ ప్రభుత్వం పేదల కోసం కష్టపడి పనిచేస్తుంది.. పీఎం మోడి ఆదేశాలతో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నానని అన్నారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటివరకు అభివృద్ధి నోచుకోని గ్రామాలు ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. సంపూర్ణత అభియాన్ కింద దేశవ్యాప్తంగా 500 మండలాలు ఎంపిక చేశామని.. రాష్ట్రంలో 10 బ్లాక్ లు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద మహాముత్తారం మండలం ఎంపికైందన్నారు.
నీతి అయోగ్ లో భూపాలపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలవాలని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతేనే, దేశం అభివృద్ధి చెందుతుందని బండి సంజయ్ తెలిపారు. కాగా.. మారుమూల మండలంలో కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత చేపట్టారు.
Read Also: Minister Kolusu Parthasarathy: మరో రెండు పథకాల అమలు.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు..