NTV Telugu Site icon

Tirumala: రేపు తిరుమలకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక

Amith Shah

Amith Shah

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి టూర్ ఖరారయ్యింది. అమిత్ షా రేపు సాయత్రం 6:15 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రేపు రాత్రి తిరుమలలోని వకుళామాత నిలయంలో బస చేస్తారు. ఎల్లుండు ఉదయం శ్రీవారి సేవలో నిమగ్నమవుతారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు.

READ MORE: Bed performance: ‘‘బెడ్ పర్ఫామెన్స్’’ కారణంగా బీహార్ టీచర్లకు జీతం కోత.. మీరు వింటున్నది నిజమే..

కాగా… ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి భారీ ఎత్తున జరిగిన పోలింగ్ శాతాలు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేశాయి. బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా దేశవ్యాప్తంగా బిజీగా పర్యటనలు జరిపారు. ఇప్పుడు చివరి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగబోతోంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించిన ఆయన.. రేపు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఏపీకి రానున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్నారు. కాగా.. టీడీపీ అగ్రనేత చంద్రబాబు, జనసేన అగ్రనేత పవన్ కల్యాణ్ కూడా 31న భేటీ కానున్నారు.