Site icon NTV Telugu

Gajendra Singh Shekhawat: రిజర్వాయర్లను కాపాడుతున్నాం.. ప్రతీ నీటి బొట్టును వినియోగించే మెకానిజం జరగాలి

Gajendra Singh Shekhawat

Gajendra Singh Shekhawat

Gajendra Singh Shekhawat: ప్రతీ నీటి బొట్టును తిరిగి వినియోగించేలా సమర్థ మెకానిజం జరగాలి ఆకాక్షించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌.. విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ఐసీఐడీ) కాంగ్రెస్‌ ప్లీనరీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికీ ఇండియాలో 65 శాతం వ్యవసాయం భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉందన్నారు. భూగర్భ జలాల నిర్వహణ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్న ఆయన.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిల్వల నిర్వహణ జరగాలన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇరిగేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతున్నాం అన్నారు షెకావత్‌.. ప్రపంచ దేశాలకు భారత్‌ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోందని.. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం అని వెల్లడించారు.. కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపడుతోంది.. రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం.. భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు.. నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్‌ తరాలను ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. వాటర్‌ రీసైక్లింగ్‌ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నాం.. తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం అని వెల్లడించారు..

నీటి సంరక్షణ కోసం 2019లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జలశక్తి అభియాన్‌ ప్రారంభించామని గుర్తు చేశారు షెకావత్.. జలశక్తి అభియాన్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్న ఆయన.. నదుల అనుసంధాన ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందన్నారు.. ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో నదులను అనుసంధానం చేస్తున్నాం.. అంతేకాకుండా డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ల ద్వారా డ్యామ్‌ల పరిరక్షణ చేపట్టాం.. డ్యాం సేఫ్టీ యాక్ట్ ను తీసుకొచ్చి రిజర్వాయర్ లను మోడీ ప్రభుత్వం సురక్షితంగా కాపాడుతోందని వెల్డించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

Exit mobile version