Site icon NTV Telugu

Amit Shah: పాశమైలారం పరిశ్రమ ప్రమాదంపై అమిత్ షా రియాక్షన్…

Amith Shah

Amith Shah

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. రియాక్టర్‌ పేలడంతో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. స్థానిక పరిపాలనతో కలిసి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు అమిత్ షా తెలియజేశారు. బాధిత కుటుంబీకులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ పోస్ట్ పంచుకున్నారు.

READ MORE: Srisailam Laddu Prasadam: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఆరోపణల వెనుక కుట్రకోణం..!

“తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగిన రసాయన పరిశ్రమలో ప్రమాదం ఎంతో విషాదకరం. ఈ ఘటన జరిగిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం అక్కడకు చేరుకుని స్థానిక అధికారులతో కలిసి రక్షణ చర్యలు కొనసాగిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.” అని కేంద్ర మంత్రి పోస్ట్‌లో పేర్కొన్నారు.

READ MORE: CBI: 2016లో అదృశ్యమైన జేఎన్‌యూ ముస్లిం విద్యార్థి.. ఆధారాలు లేకపోవడంతో కేసు క్లోజ్..

Exit mobile version