NTV Telugu Site icon

Delhi: రాష్ట్రపతిని కలిసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా, సహచర మంత్రులు

Raje

Raje

కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తన మంత్రివర్గ సహచరులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్‌లను కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే జేపీ నడ్డా.. మోడీ 3.0 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించారు.

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి స్పీకర్ పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 240 సీట్లే సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మిత్రపక్షాల సాయంతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇండియా కూటమి కూడా 233 స్థానాలు సొంతం చేసుకుంది. విపక్ష కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తోంది. ఇవ్వకుంటే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని లీక్‌లు ఇస్తోంది.

ఇది కూడా చదవండి: Gurugram: ఫైర్‌బాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..నలుగురు మృతి..