Site icon NTV Telugu

Union Minister: 2026లో మధురై ఎయిమ్స్‌ పూర్తి.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

Jitendra Singh

Jitendra Singh

Union Minister Jitendra Singh: కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని రాష్ర్టాలకు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)ను మంజూరు చేశాయి. అందులో భాగంగా చాలా రాష్ట్రాల్లో ఎయిమ్స్‌ నిర్మాణాలను పూర్తి చేయలేదు. కొన్ని రాష్ర్టాల్లో చివరి దశల్లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో మధురైలో ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణం 2026లోగా పూర్తవుతుందని కేంద్ర సైన్స్‌, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి సంయుక్తంగా ప్రకటించారు. బీజేపీ బలోపేతంపై చర్చించేందుకు సోమవారం ఉదయం చెన్నైకి విచ్చేసిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్.. స్థానిక అడయార్‌లోని ఓ హోటల్లో పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లపాటు ప్రజలకు సుపరిపాలన అందించిందని పేర్కొన్నారు.

Read Also: Hyderabad Police: మందు తాగితే అంతే సంగతులు.. ఇక చర్లపల్లి జైలుకే!

అన్ని రంగాల్లోనూ దేశం ముందంజలో ఉందని, నగరాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరిచిందన్నారు. 15 నగరాల్లో మెట్రో రైల్వే సేవలు ప్రారంభించిందని తెలిపారు. కొత్తగా దేశ వ్యాప్తంగా 700 వైద్య కళాశాలలు ప్రారంభించిందని, రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతినిచ్చిందని గుర్తు చేశారు. 2026లోగా మదురైలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీని పటిష్ఠం చేసే దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుండి నగరస్థాయి వరకు బహిరంగ సభలు నిర్వహించనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అధివృద్ధి పథకాల గురించి ఇంటింటికీ వెళ్ళి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు.

Exit mobile version