ఎంపీ ల్యాడ్స్‌పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ ల్యాడ్స్‌ను పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేయనుంది మోడీ సర్కార్. తమ నిజయోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పార్లమెంట్ సభ్యులకు అవకాశం రాబోతోంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ – ఎంపీ ల్యాడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడమే దీనికి కారణం. కరోనా కారణంగా ఎంపీ ల్యాడ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే… ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిస్థితులు చక్కబడుతుండడంతో… ఎంపీ ల్యాడ్స్‌ను పునరుద్ధరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన కాలానికి నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి 2 కోట్ల రూపాయల చొప్పున ఎంపీ ల్యాడ్స్ కింద ఏకమొత్తంలో నిధులు అందనున్నాయి. 2026 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎంపీ ల్యాడ్స్ కింద ఏడాదికి 5 కోట్ల రూపాయల్ని ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. రెండున్న కోట్ల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఈ మొత్తాన్ని అందజేస్తోంది. కరోనా విజృంభణతో వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యాయి. దీంతో గతేడాది ఏప్రిల్‌లో ఎంపీ ల్యాడ్స్‌ను ఆపి… ఆ నిధులు వైద్య రంగం అవసరాలకు వినియోగించుకుంది కేంద్ర ప్రభుత్వం.
Also Read
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!