Union Budget 2026 live Updates: పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతున్నారు. పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.. దేశం 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని.. గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని.. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నామని చెప్పారు.. ఈ బడ్జెట్‌ను ‘యువశక్తి బడ్జెట్’గా అభివర్ణించిన ఆర్థిక మంత్రి.. మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించారు. “కర్తవ్యం-1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి, కర్తవ్యం- 2: వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, కర్తవ్యం- 3: ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రం” అని అభివర్ణించారు.. 21వ శతాబ్దం టెక్నాలజీదే అని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2026-27 మొత్తం బడ్జెట్ అంచనా రూ. 53.5 లక్షల కోట్లు:
రెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లు
పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు
పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లు
మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు
రుణాల రికవరీ రూ.38,397 కోట్లు
ఇతర వసూళ్లు రూ.80,000 కోట్లు
మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,92,702 కోట్లు
మూలధన ఖాతా రూ.12,21,821 కోట్లు
వాస్తవ మూలధన వ్యయం రూ.17,14,523 కోట్లు
రెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లు
నికర రెవెన్యూ లోటు రూ.99,642 కోట్లు
ద్రవ్య లోటు రూ.16,95,768 కోట్లు
ప్రాథమిక లోటు రూ.2,91,796 కోట్లు
అప్పులు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లు
మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లు
మొత్తం వ్యయం రూ.53,47,315 కోట్లు
రెవెన్యూ ఖాతా రూ.41,25,494 కోట్లు
వడ్డీ చెల్లింపులు రూ.14,03,972 కోట్లు
17 క్యాన్సర్ డ్రఫ్‌లు, అరుదైన వ్యాధులకు ఉపయోగించే 17 రకాల మందులను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
బడ్జెట్ ప్రభావం: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 1100 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 350 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ..
కార్పొరేట్ ట్యాక్స్ యథాతథం.. తగ్గనున్న సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు.. బీడీలు, బ్యాటరీలపై తగ్గనున్న రేట్లు.. CNG, బయోగ్యాస్, క్యాన్సర్ మందుల ధరలు తగ్గింపు: నిర్మలా సీతారామన్
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. 300 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 140 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ..
భారత్ నుంచి క్లౌడ్ సర్వీస్ సేవలు అందించే కంపెనీలకు పన్ను మినహాయింపు.. 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలీడే.. బై-బ్యాక్ షేర్లపై కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్.. మైనార్టీ వాటాదారులను రక్షించడానికి ప్రత్యేక చర్యలు: నిర్మలా సీతారామన్
2026-2027 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.3 శాతంగా అంచనా వేశారు. ఈ అంశాన్ని 2026 బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు.. ట్యాక్స్ నిబంధనల్లో సడలింపు.. TCS 5% నుంచి 2 శాతానికి తగ్గింపు.. మోటార్ యాక్సిడెంట్ చెల్లింపులపై పన్ను సడలింపు.. మార్చి 31 వరకు ఆదాయపన్ను చెల్లింపుకు గడువు.. జులై 31 వరకు ITR 1, ITR 2: విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైమ్ స్కీమ్.. చిన్న తరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు 6 నెలల ఊరట: నిర్మలా సీతారామన్
మహిళల ద్వారా ప్రత్యేక ‘షీ మార్ట్స్’ బజార్ల ఏర్పాటు.. షీ మార్ట్స్ బజార్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందజేస్తాం: నిర్మలా సీతారామన్
చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు.. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి చర్యలు. పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు.. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం.. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం.. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు: నిర్మలా సీతారామన్
రైతుల కార్యకలాపాలను పెంచడానికి నిర్మలా సీతారామన్ బహుభాషా AI సాధనాన్ని ప్రకటించారు..
21వ శతాబ్దం టెక్నాలజీదే.. ఏఐ మిషన్ కు ప్రాధాన్యం.. హై లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటు.. ఏఐతో విద్యార్థులు, రైతులకు ఉపయోగపడే ప్రణాళికలు: నిర్మలా సీతారామన్
నగరాలే దేశ గ్రోత్ ఇంజిన్లు.. రెండో, మూడో స్థాయి నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.. పాట్నా, వారణాసిల్లో షిప్ రిపేర్ ఎకోసిస్టమ్.. 7 హైస్పీడ్ రైల్ కారిడార్ల అభివృద్ధి.. ముంబై- పుణే, పుణే-హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్లు.. ఢిల్లీ- వారణాసి, వారణాసి- సిలిగురి మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్: నిర్మలా సీతారామన్
ఆర్థిక సుస్థిరత కోసం ఆరు రంగాల్లో కీలక సంస్కరణలు.. రెండు హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు.. MSMEలకు క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. విలువైన ఖనిజాల తవ్వకాల కోసం కొత్త స్కీమ్.. కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో రేర్ ఎర్త్ కారిడార్.. SME గ్రోత్ ఫండ్‌కు రూ. 10 వేల కోట్లు.. కార్గో అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ.. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జలమార్గాలు.. ఒడిశాలో నేషనల్ వాటర్‌వే కారిడార్.. కొత్తగా కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్: నిర్మలా సీతారామన్
2027 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాన్ని 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెంచినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
సెమీకండక్టర్ మిషన్ 2.0 ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాంకేతిక, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి పరిశ్రమ నేతృత్వంలోని పరిశోధన, శిక్షణ కేంద్రాలపై దృష్టి పెడతామని చెప్పారు.
రాబోయే ఐదు సంవత్సరాలలో రూ. 10,000 కోట్లతో బయో ఫార్మా శక్తిని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
ఉపాధి కల్పనకు సమగ్ర సంస్కరణలను తీసుకొచ్చాం.. నేషనల్ సెమీకండక్టర్ మిషన్‌ను ఏర్పాటు చేశాం.. సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం రూ. 40 వేల కోట్లు కేటాయింపు.. ఖాదీ రంగం కోసం మహాత్మాగాంధీ స్వరాజ్ స్కీమ్.. ఫార్మా రంగానికి రూ. 10 వేల కోట్లు.. టెక్స్టైల్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం.. మెగా టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటు.. దేశంలో కొత్తగా మూడు NIPERల ఏర్పాటు.. ప్రస్తుతం ఉన్న NIPERల ఆధునికీకరణకు చర్యలు: నిర్మలా సీతారామన్
3 కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించిన నిర్మలా.. కర్తవ్యం-1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి, కర్తవ్యం- 2: వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, కర్తవ్యం- 3: ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రం.. ఫిస్కల్ డిసిప్లిన్‌ను సాధించాం.. జనవరిలో జీఎస్టీ కలెక్షన్లు రూ. 1.93 లక్షల కోట్లు.. ఎకానమీలో నిలకడ వచ్చింది.. ద్రవ్యోల్బణం మోడరేట్‌గా ఉంది: నిర్మలా సీతారామన్
తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళలకు అరుదైన భూ ఖనిజాల కారిడార్ నిర్మాణాన్ని సీతారామన్ గ్రీన్ సిగ్నల్..
దేశాభివృద్ధికి సహాయపడే మూడు కర్తవ్యాలను నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వృద్ధి, ప్రజల ఆకాంక్షలు, సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనేవి మూడు కర్తవ్యాలు అని ఆమె తెలిపారు.
ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం.. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నాం.. ఈ బడ్జెట్‌ను ‘యువశక్తి బడ్జెట్’గా అభివర్ణించిన నిర్మలా.. మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించిన నిర్మలా.. నిర్మాణాత్మక సంస్కరణలతో ఈ కర్తవ్యాలను సాధిస్తాం: నిర్మలా సీతారామన్
పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాం.. 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాం.. వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం.. గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాం: నిర్మలా సీతారామన్
బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం లభించింది.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తన రికార్డు తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
జనవరిలో స్థూల GST వసూళ్లు 6.2 శాతం పెరిగాయి. అంటే దాదాపు రూ.1.93 లక్షల కోట్లకు పైగా వృద్ధి లభించింది. ప్రధానంగా దిగుమతుల నుంచి వచ్చిన అధిక ఆదాయం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వార్తా సంస్థ PTI నివేదించింది. మొత్తం వాపసులు 3.1 శాతం తగ్గి రూ.22,665 కోట్లకు చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.
మరికొద్ది సేపట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు, అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆమెకు ఆచారబద్ధంగా చక్కెర పెరుగు మిశ్రమాన్ని తినిపించారు.
ఈ ఆర్థిక ఏడాది ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయం రూ. 11.2 లక్షల కోట్లుగా బడ్జెట్‌లో అంచనా.
కేంద్ర బడ్జెట్ 2026లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
భారతదేశ ఆర్థిక చరిత్రలో ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.