Site icon NTV Telugu

Union Budget 2025: రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌.. ఏ శాఖకు ఎంతంటే!

Budget 2025

Budget 2025

Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.50,65,345 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వివిధ రంగాలకు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఐటీ, పట్టణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇకపోతే ఏ శాఖకు ఎంత బడ్జెట్ అన్న విషయానికి వెళ్తే.. ఈ బడ్జెట్‌లో రక్షణ, గ్రామీణాభివృద్ధి, హోంశాఖ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి ముఖ్యమైన రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. మరి ఏ శాఖకు ఎంతన్న విషయానికి వస్తే..

Also Read: Google Maps: కొంప ముంచిన గూగుల్‌ మ్యాప్స్‌.. లోయలోకి భారీ కంటైనర్..

* రక్షణ రంగం – రూ.4,91,732 కోట్లు
* గ్రామీణాభివృద్ధి – రూ.2,66,817 కోట్లు
* హోంశాఖ – రూ.2,33,211 కోట్లు
* వ్యవసాయం & అనుబంధ రంగాలు – రూ.1,71,437 కోట్లు
* విద్యారంగం – రూ.1,28,650 కోట్లు
* ఆరోగ్య రంగం – రూ.98,311 కోట్లు
* పట్టణాభివృద్ధి – రూ.96,777 కోట్లు
* ఐటీ, టెలికాం – రూ.95,298 కోట్లు
* ఇంధన రంగం – రూ.81,174 కోట్లు
* వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు – రూ.65,553 కోట్లు
* సామాజిక, సంక్షేమ రంగం – రూ.60,052 కోట్లు
* శాస్త్ర, సాంకేతిక రంగం – రూ.55,679 కోట్లు

Also Read: Union Budget 2025: భవిష్యత్ ఆవిష్కరణలకు మద్దతుగా పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్..

ఈసారి బడ్జెట్‌లో సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, ఐటీ, పట్టణాభివృద్ధి రంగాలకు అధిక నిధులు కేటాయించడం ద్వారా భారతదేశం 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యాన్ని చేరుకోవడానికి అడుగులు వేస్తోంది.

Exit mobile version