Union Budget 2025: భారత విద్యా వ్యవస్థలో AI విప్లవం.. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయాలు
- భారత విద్యా వ్యవస్థలో AI విప్లవం తీసుక రాబోతున్న కేంద్ర సర్కార్
- AI అభివృద్ధితో పాటు, కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త IITలలో మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులు.
- AI అభివృద్ధికి రూ.500 కోట్ల కేటాయింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2025: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై కేంద్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 యూనియన్ బడ్జెట్లో భాగంగా AI అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ, ఈ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.500 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాలను (CoEs) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రాలు అధునాతన AI పరిశోధనకు, విద్యా రంగంలో AI వినియోగాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల కోసం AI ఆధారిత ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆటోమేటెడ్ అసెస్మెంట్లు, వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందించేందుకు వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
Also Read: Sankarabharanam: 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
AI అభివృద్ధితో పాటు, కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త IITలలో మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులను కేటాయించింది. ఈ చర్య ద్వారా అదనంగా 6,500 మంది విద్యార్థులకు వసతి కల్పించే హాస్టల్, విద్యా సదుపాయాలు అందించనుంది. IIT భిలాయ్, IIT ధార్వాడ్, IIT గోవా, IIT జమ్మూ, IIT తిరుపతి లాంటి ఐదింటికి ఈ విస్తరణ లభించనుంది. సాంకేతికత, AI, విద్య – ఈ మూడు రంగాల్లో అభివృద్ధి సాధించి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవాలని మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ వ్యూహం ద్వారా AI పరిశోధనను వేగవంతం చేసి, దేశాన్ని AI రంగంలో అగ్రగామిగా మార్చాలని కేంద్రం భావిస్తోంది.
Also Read: Railway Stocks: బడ్జెట్ సెషన్స్ వేళ లాభాల్లో రైల్వే స్టాక్స్..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను పరిశ్రమ నిపుణులు స్వాగతిస్తున్నారు. భారతదేశంలో AI ప్రతిభను పెంచేందుకు, పరిశోధన అవకాశాలను మెరుగుపర్చేందుకు, విద్యా వ్యవస్థను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత విద్యా వ్యవస్థలో AI వినియోగానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు, దేశ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారబోతున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!