Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. ఇది తనకు ఏడవ కేంద్ర బడ్జెట్. బడ్జెట్ తర్వాత చాలా వస్తువులు చౌకగా.. మరి కొన్ని ఖరీదైనవిగా మారాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మొదటి బడ్జెట్ భారతదేశ ఆర్థిక దృక్పథాన్ని రూపొందించడానికి ఉద్దేశించబడింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి నుండి సామాజిక సంక్షేమ కార్యక్రమాల వరకు ప్రతిదానిని ప్రభావితం చేస్తుంది. మొబైల్ ఫోన్లు, బంగారం, వెండి, రాగి ధరలను తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
Read Also:Bollywood dreams: ఇక్కడ హిట్లు వస్తున్నా.. అక్కడ ఆఫర్ల కోసం ఆరాటం..
చౌక, ఖరీదైన వస్తువుల జాబితా
* మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బీసీడీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
* బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు.
* క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన మూడు ఔషధాలకు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఇచ్చారు.
* సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని కూడా నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
* అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్‌పై 25 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
* భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించడానికి కెమెరా లెన్స్‌లతో సహా వివిధ భాగాలపై దిగుమతి పన్నును తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
* ఈ-కామర్స్ సంస్థలకు టీడీఎస్ తగ్గించారు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్‌లో ధరలు తగ్గనున్నాయి.
* ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగించబడింది.
* నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 10శాతం నుంచి 15 శాతానికి పెంచారు.
Read Also:Andhra Pradesh: టీటీడీ లెటర్స్‌పై మండలిలో ఆసక్తికర చర్చ