☛ కేంద్ర బడ్జెట్ 2024-25 కేటాయింపుల ఇలా..
* పదేళ్లలో ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుంది.
* సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్.. అదే మా మంత్రం.
* నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు.
* గత పదేళ్లలో అందరికీ ఇళ్లు, వంట గ్యాస్, విద్యుత్ అందేలా కృషి చేశాం. 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందించడం ద్వారా ఆహార సమస్య లేకుండా చేశాం.
* 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్‌ను మలిచే దిశగా పని చేస్తున్నాం.
* బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి.
* శతాబ్ధంలోని అతిపెద్ద సంక్షోభం కోవిడ్‌ను అధిగమించాం.
☛ కోవిడ్‌ను అధిగమించి అభివృద్ధి సాధించాం. రాబోయే కాలంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం.
* చాలా మందికి సామాజిక న్యాయం అనేది ఒక రాజకీయ నినాదం మాత్రమే.
☛ గత పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా చర్యలు తీసుకున్నాం.
* రైతు బీమా ద్వారా 11.8కోట్ల మందిని ఆదుకున్నాం. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 1.4కోట్ల మంది యువతకు శిక్షణ.
* 3000 కొత్త ఐటీఐలను ఏర్పాటు చేశాం
* రూ.34 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం.
☛ ప్రారిశ్రామిక విధానాల ద్వారా మహిళలను ప్రోత్సహించాం
* ట్రిపుల్ తలాక్ రద్దు, మూడొంతుల సీట్లు లోక్‌సభలో కేటాయింపు
* గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం ఇళ్లను మహిళలకు ఇవ్వడం (పీఎం ఆవాస్ యోజనా కింద) వంటి కార్యక్రమాలన్నీ వారి గౌరవాన్ని పెంచాయి.
* వ్యవస్థీకృతమైన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాం.
* 30 కోట్ల ముద్రా యోజనా రుణాలు మహిళలకు ఇచ్చాము
* ఉన్నత విద్యలో మహిళల ముందుకు సాగుతున్నారు.
* స్టెమ్ కోర్సుల్లో 43 శాతం మహిళా విద్యార్థులే.
* ఇవన్నీ ఉద్యోగ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చేసింది
బడ్జెట్ లోని మరిన్నీ ముఖ్య విషయాలు..
* మిషన్ ఫర్ వికసిత్ భారత్…
* సుసంపన్నమైన భారత్‌ను ఏర్పాటు చేయడం మా లక్ష్యం.
* ప్రకృతితో మమేకమై, ఆధునిక మౌలిక సదుపాయాలతో అందరికీ వారి సామర్థ్యానికి తగ్గట్టుగా రాణించేందుకు అవకాశం కల్పించడం మా లక్ష్యం.
* అందరి విశ్వాసం చూరగొనడం ద్వారా రానున్న ఐదేళ్లలో అనూహ్యమైన అభివృద్ధి కనిపించనుంది.
* ఇది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు సువర్ణ సంవత్సరాలుగా మిగలనున్నాయి.
* మా దృష్టిలో జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పర్ఫార్మెన్స్.
* మా ప్రభుత్వానికి సకాలంలో తగినంత ఆర్థిక వనరులు, టెక్నాలజీలు, శిక్షణ ఇవ్వడం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అందివ్వడం ప్రాధాన్యమైన అంశం.
* పంచామృత్ లక్ష్యాలకు అనుగుణంగా మరింత సుస్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తాం
* ఇంధన భద్రత, అందరికీ చౌకగా ఇంధనం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
* 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధిస్తాం. సామాజిక న్యాయం మా పరిపాలనా విధానంలో ఒక భాగం.
* ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి.
* ప్రజల ఆదాయంలో పెరుగుదల ఉంది.
* పన్ను సంస్కరణలతో గుణాత్మకమైన పురోగతి సాధించాం.
* ద్రవ్యోల్భణాన్ని అరికట్టడంలో విజయం సాధించాం.
* పాలనలో పారదర్శకతను పెంచాం.
* పీఎం ఫసల్ కింద నాలుగు కోట్ల మంది రైతులకు బీమా అందించాం.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్భణం, అధిక వడ్డీ.
* పీఎం ఆవాస్ యోజక కింద మహిళలకు 70వేల గృహాలు అందించాం.
* యూరప్ ఎకనామిక్ కారిడార్ దేశానికి గేమ్‌ఛేంజర్‌గా మారబోతోంది.
* డెమోగ్రఫీ, డెమొక్రసీ, డైవర్శిటీలకు సబ్ కా ప్రయాస్ అంటే అందరి ప్రయత్నాలను జోడించడం ద్వారా ప్రతి భారతీయుడి ఆకాంక్షలను నెరవేర్చగలం.
* స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశంలో అవకాశాలకు కొదవలేదని,
* ఆకాశమే హద్దని వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
* చాలా మందికి సామాజిక న్యాయం అనేది ఒక రాజకీయ నినాదం మాత్రమే.
* గత పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా చర్యలు తీసుకున్నాం.
* రూ.34 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం.
* రైతు బీమా ద్వారా 11.8కోట్ల మందిని ఆదుకున్నాం. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 1.4కోట్ల మంది యువతకు శిక్షణ.
* దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశాం.
* 3000 కొత్త ఐటీఐలను ఏర్పాటు చేశాం.
* ప్రారిశ్రామిక విధానాల ద్వారా మహిళలను ప్రోత్సహించాం
* 30 కోట్ల ముద్రా యోజనా రుణాలు మహిళలకు ఇచ్చాము
* ట్రిపుల్ తలాక్ రద్దు, మూడొంతుల సీట్లు లోక్‌సభలో కేటాయింపు
* గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం ఇళ్లను మహిళలకు ఇవ్వడం (పీఎం ఆవాస్ యోజనా కింద) వంటి కార్యక్రమాలన్నీ వారి గౌరవాన్ని పెంచాయి.
* అందరికీ అవకాశాలు లభిస్తాయి
* వ్యవస్థీకృతమైన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాం.
* ఉన్నత విద్యలో మహిళల ముందుకు సాగుతున్నారు.
* స్టెమ్ కోర్సుల్లో 43 శాతం మహిళా విద్యార్థులే.
* ఇవన్నీ ఉద్యోగ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చేసింది.