NTV Telugu Site icon

Bandi Sanjay: మానవత్వం చాటుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

Sanjay

Sanjay

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుంది. స్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన లారీ డ్రైవర్ ఆపాడు. బాధితురాలిని మానకొండూర్ మండలం కెల్లెడు గ్రామానికి చెందిన దివ్యశ్రీ గా గుర్తించారు. ములుగు జిల్లా పర్యటనకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. ఘటన స్థలంలో ఆగారు. దివ్యశ్రీని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. లారీ కింద టైర్ పక్కన రాడులో మహిళ జుట్టు చిక్కుకుంది. భయపడొద్దు ధైర్యంగా ఉండాలంటూ సంజయ్ సదరు మహిళకు సూచించారు. ఎట్టకేలకు స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీశారు. గాయాల పాలైన మహిళను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స కోసం ఆసుపత్రిలో ఖర్చును తానే భరిస్తానని వైద్యులకు సంజయ్ తెలిపారు.

READ MORE: AP Budget 2024: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్!

ఇదిలా ఉండగా.. ములుగు జిల్లా కేంద్రానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ కి గట్టమ్మ దగ్గర బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గట్టమ్మా దర్శించుకొని.. ములుగు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశానికి ఆయన వచ్చారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Show comments