NTV Telugu Site icon

AP CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌

Jagan

Jagan

సీఎం వైఎస్‌ జగన్‌ను యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌ (ఏపీ, కర్ణాటక, తెలంగాణ) డా. జెలాలెం బి. టాఫెస్సే కలిశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్య రంగంలోని వివిధ స్ధాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు యూనిసెఫ్‌ చీఫ్‌ సంసిద్దత వ్యక్తం చేశారు. ప్రైమరీ హెల్త్‌ కేర్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీలు), ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్‌వాడీ వర్కర్స్, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్స్‌ వంటి వివిధ స్ధాయిల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూనిసెఫ్‌ ముందుకొచ్చింది.

Read Also: Priyanshu Singh: పునీత్ నన్ను రెండు సార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు.. నటి సంచలన వ్యాఖ్యలు

వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యూనిసెఫ్‌ బృందంతో సీఎం వైఎస్‌ జగన్ చర్చించారు. సుస్ధిరాభివృద్ది లక్ష్యాల సాధనలో ముందుకెళుతున్న తీరును సీఎం వారికి వివరించారు. ఏపీ సీఎంను యూనిసెఫ్‌ చీఫ్‌ డా. జెలాలెం బి. టాఫెస్సే అభినందించారు. చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్‌ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామన్న యూనిసెఫ్‌ టీమ్‌ పేర్కొనింది. ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు యూనిసెఫ్‌ ప్రతినిధులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చైల్డ్‌ మ్యారేజ్‌ ఫ్రీ స్టేట్‌గా ఏపీని తీర్చిదిద్దినట్లు సీఎం జగన్ వెల్లడించారు.

Read Also: R Madhavan: ఎఫ్‌టీఐఐ కొత్త అధ్యక్షుడిగా మాధవన్‌ నామినేట్.. అభినందించిన కేంద్ర మంత్రి