Undavalli Arun Kumar: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని హితవు చెప్పిన ఆయన.. పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు ఉండవల్లి..
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ వ్యాఖ్యానించడం సరికాదు అన్నారు.. ఇక, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ఇల్లు, వ్యాపారాలు ఎందుకు ఆంధ్రకు తీసుకురావడం లేదు? అని ప్రశ్నించారు.. మరోవైపు, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఎంత కాలం కొనసాగుతుందో చూడాలన్నారు.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతోనే టీడీపీ-జనసేన-బీజేపీ కలిశాయి.. అందుకే విజయం సాధించారు అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. కాగా, కోనసీమకు తెలంగాణ దిష్టి అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందం అయిన విషయం విదితమే కాగా.. పవన్ కామెంట్లపై తెలంగాణ నేతలు ఫైర్ అవుతోన్న విషయం విదితమే..
