NTV Telugu Site icon

Vijayawada Rain: బెజవాడ వాసులకు వర్షంతో ఉపశమనం

Rain Vja

Rain Vja

అసలే ఎండాకాలం.. భగభగమండుతోంది వాతావరణం. అందులోనూ విజయవాడ పేరు చెబితే ఎండతీవ్రత మామూలుగా ఉండదు. ఉమ్మడి కృష్ణ జిల్లాలో ఒక్కసారిగా చల్లబడింది వాతావరణం..ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. విజయవాడ నగరంలో తేలికపాటి వర్షాలు కురిశాయి. గుడివాడలో బలమైన గాలులతో కురుస్తున్న భారీ వర్షం, అక్కడక్కడ పడుతున్న వడగళ్ళతో వాతావరణం మారిపోయింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో వాతావరణం చల్లబడింది. భానుడి వేడికి మండిన నేలపై చినుకులు పడడంతో కమ్మటి మట్టి వాసన వచ్చింది. దీంతో జనం ఉపశమనం పొందారు.

Read Also: Upasana Konidela: చరణ్ నన్ను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడు అన్నారు

ఇవాళ కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుడ్ మెన్ పేటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో భయంతో ఇళ్లల్లోకి పరుగులు తీశారు మహిళలు చిన్నపిల్లలు. చాలా ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురవడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. వేడిగాలులకు బదులు చల్లటి గాలులు వీశాయి. వారం క్రితం వర్షాలు పడ్డాయి. అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది. రాబోయే రెండు మూడు రోజులలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే, ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also: Upasana Konidela: చరణ్ నన్ను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడు అన్నారు