NTV Telugu Site icon

Uncontrolled Car : అతివేగంగా వెళ్లి స్థంభాన్ని ఢీకొట్టి.. బాంబులా పేలిన కారు

Car

Car

Uncontrolled Car : హర్యానా రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వెళ్లిన కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. బల్లాభ్‌ఘర్‌లో అర్థరాత్రి ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఢీకొనడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే పక్కనే ఉన్నవారు కారులో ఉన్న వారందరినీ బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read Also: PAN And Aadhaar Link: జూన్ 30 వరకు పాన్, ఆధార్ లింక్ గడువు పొడగింపు..

బల్లాబ్‌ఘర్‌లోని మలెర్నా రోడ్‌లో అదుపుతప్పిన కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం అర్థరాత్రి సమయంలో చోటుచేసుకుంది. ప్రమాద శబ్ధం విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కున్న ముగ్గురిని బయటకు తీశారు. ఇది జరిగిన నిమిషాల వ్యవధిలోనే పేలుడుతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read Also: B.Ramagopal Reddy: ఏపీలో ఒంటిపూట బడులు ఇంకెప్పుడు?

ప్రస్తుతం ఫరీదాబాద్ పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు వేగం చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. దీంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం కారణంగా కారులో నిప్పురవ్వలు చెలరేగడంతో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వ్యక్తులు ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.