Site icon NTV Telugu

Gaza : కలలో కూడా చూడని విధ్వంసం.. గాజా పునర్నిర్మాణానికి ఏళ్ల సమయం

New Project (31)

New Project (31)

Gaza : ఐక్యరాజ్యసమితి (UN) గురువారం నాడు విడుదల చేసిన నివేదికలో యుద్ధంతో దెబ్బతిన్న గాజాకు సంబంధించి షాకింగ్ అప్‌డేట్ వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గాజాలో జరిగిన విధ్వంసాన్ని ప్రపంచం చూడలేదని ఐరాస గురువారం పేర్కొంది. ఇది మాత్రమే కాదు, ఈ రోజు యుద్ధం ముగిస్తే ఇజ్రాయెల్ బాంబు దాడులు, భూదాడులలో ధ్వంసమైన ఇళ్లను మరమ్మతు చేయడానికి కనీసం 2040 వరకు పడుతుంది.

అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ చేసిన ఆకస్మిక దాడి తర్వాత ప్రారంభమైన యుద్ధం సామాజిక, ఆర్థిక ప్రభావం వేగంగా పెరుగుతోందని UN అంచనా చెబుతోంది. ఏప్రిల్ మధ్య నాటికి 33,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 80,000 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. దాదాపు 7,000 మంది ఇతర వ్యక్తులు తప్పిపోయారు. చాలా మంది శిథిలాల కింద ఖననం చేయబడి ఉంటారని భావిస్తున్నారు.

Read Also:SRH vs RR: ఉప్పల్ మైదానంలో అనసూయ సందడి.. వైరల్‌గా మారిన హాట్ యాంకర్ రియాక్షన్!

యుద్ధం కొనసాగుతున్నందున గజన్‌లు, పాలస్తీనియన్లందరూ ప్రతిరోజూ భారీ నష్టాలను చవిచూస్తున్నారని యుఎన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టెయినర్ తెలిపారు. యుఎన్‌డిపి, పశ్చిమాసియా కోసం ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ కమీషన్ నివేదిక గాజాలో మనుగడ కోసం పోరాటం భయంకరమైన చిత్రాన్ని చిత్రించింది. ఇక్కడ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 201,000 ఉద్యోగాలు పోయాయి. ఆర్థిక వ్యవస్థ 2023 చివరి త్రైమాసికంలో 81 శాతం క్షీణించింది.

అబ్దుల్లా అల్ దర్దారీ, అరబ్ దేశాలకు సంబంధించిన యూఎన్డీపీ రీజినల్ డైరెక్టర్ ఓ నివేదికలో గాజాలో సుమారు 50 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు ధ్వంసమయ్యాయని అంచనా వేశారు. 1.8 మిలియన్ పాలస్తీనియన్లు పేదరికంలోకి పడిపోయారు. 2007లో హమాస్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి గాజాను ఇజ్రాయెల్, ఈజిప్ట్ దిగ్బంధనం చేసింది. భూభాగం నుండి ప్రవేశం, నిష్క్రమణపై కఠినమైన నియంత్రణలను విధించింది. యుద్ధానికి ముందే, అది 45 శాతం అధిక నిరుద్యోగాన్ని ఎదుర్కొంది. యువ కార్మికులలో దాదాపు 63 శాతానికి చేరుకుంది. యూఎన్ మానవ అభివృద్ధి సూచిక, ఆరోగ్యకరమైన జీవితానికి, జ్ఞానాన్ని , మంచి జీవన ప్రమాణాన్ని సాధించడం కోసం కీలక అంశాలను కొలుస్తుంది. ఈ యుద్ధంతో గాజా 20ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది.

Read Also:Bengal Governor: గవర్నర్ లైంగికంగా వేధించాడంటూ రాజ్‌భవన్ ఉద్యోగి ఫిర్యాదు..

ఆర్థిక వ్యవస్థ మూలాధారం ధ్వంసమైంది.. రంగాలు 90 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. 2024లో గాజా జిడిపి 51 శాతం క్షీణించవచ్చని అంచనా. నష్టం పరిధి, స్థాయి యుద్ధం కొనసాగుతున్నందున అది ఇంకా పెరుగుతోంది. గాజాలో కనీసం 370,000 గృహాలు దెబ్బతిన్నాయి. అందులో 79,000 పూర్తిగా ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది.

Exit mobile version