Site icon NTV Telugu

Umpire’s Call: పాపం పాకిస్థాన్.. కొంపముంచిన అంపైర్స్ కాల్!

Umpire's Call

Umpire's Call

Umpire’s Call Cost Pakistan Defeat To South Africa: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో దాయాది పాకిస్థాన్ కథ ముగిసింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. శుక్రవారం చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ప్రపంచకప్‌ 2023లో అయిదో విజయంతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా సెమీస్‌కు మరింత చేరువ కాగా.. వరుసగా నాలుగో ఓటమితో పాక్‌ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే గెలిచే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం ‘అంపైర్స్ కాల్’. ఈ అంపైర్స్ కాల్ పాక్ కొంపముంచింది.

271 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ విజయానికి ఒక్క వికెట్ అవసరం కాగా.. ప్రొటీస్ గెలుపుకు 11 పరుగులు అవసరం అయ్యాయి. దాంతో ప్రపంచకప్ 2023లోనే ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా మారింది. పాక్ పేసర్లు బంతులతో నిప్పులు చెరుగుతుండటంతో బావుమా సేన ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అంపైర్స్ కాల్ రూపమ్లో పాకిస్థాన్‌ను దురదృష్టం వెంటాడింది.

పాకిస్థాన్ సీనియర్ పేసర్ హరీష్ రౌఫ్ వేసిన 46వ ఓవర్ చివరి బంతి దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షంసీ పాడ్స్ తాకింది. దాంతో పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే కెప్టెన్ బాబర్ ఆజామ్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్.. అంపైర్స్ కాల్‌గా ప్రకటించాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్‌ను లైట్‌గా తాకడంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చాడు. దాంతో షంసీ బతికిపోయాడు. ఆపై ప్రొటీస్ విజయాన్ని అందుకుంది.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

బాల్ ట్రాకింగ్‌లో 50 శాతం కంటే తక్కువ లెగ్ లేదా ఆఫ్ స్టంప్‌ను బంతిని తాకితే అంపైర్స్ కాల్‌గా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే.. తబ్రైజ్ షంసీ అవుట్ అయ్యేవాడు. దాంతో ప్రొటీస్ జట్టు 263 పరుగులకే ఆలౌటయ్యేది. అప్పుడు పాక్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. సెమీస్ రేసులో నిలిచేది. ఇక్కడ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో.. పాక్ ఓటమి ఖాయం అయింది. ప్రస్తుతం అంపైర్ కాల్స్ నిబంధనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

Exit mobile version