NTV Telugu Site icon

Naatu Naatu Song: నాటు నాటు సాంగ్‌పై సైనికుల డ్యాన్స్‌.. ఎక్కడంటే..

Dance

Dance

Naatu Naatu Song: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట‌ ఎంత క్రేజ్‌ సంపాదించుకుంది తెలుసు. ఏకంగా ఆస్కార్‌కి నామినేట్‌ అయి అవార్డును సైతం సొంతం చేసుకుంది. నాటు నాటు పాట డ్యాన్స్ ను దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది. సాధారణ పౌరులే కాకుండా.. కొన్ని దేశాల్లో ఉద్యోగులు కూడా నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు చూస్తున్నాం. ఇపుడు ఏకంగా సైనికులే నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసి చిందులేసి ఎంజాయ్‌ చేశారు

నాటు నాటు పాటకు ఉక్రెయిన్ సైనికులు చిందేశారు. ఇటీవ‌ల ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ సాంగ్ కేట‌గిరీలో నాటు నాటు పాట‌కు అవార్డును సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. నాటు నాటు పాట‌పై ఉక్రెయిన్ సైనికులు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ త‌ర‌హాలోనే.. ఉక్రెయిన్ సైనికులు స్టెప్పులు వేసి ఇర‌గ‌దీశారు. జేన్ ఫెడ‌టోవా అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. రెండు నిమిషాల నిడివ ఉన్న ఈ వీడియోను మికోలైవ్ న‌గ‌రంలోని సైనికులు షూట్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఎలా రామ్‌, భీమ్‌లు పాట పాడారో.. అలాగే ర‌ష్యా దాడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైనికులు కూడా త‌మ డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్నారు.

Read Also: Keerthy Suresh: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమెనే…

ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ నిర్మాత‌లు త‌మ అఫీషియ‌ల్ అకౌంట్‌లోనూ ఉక్రెయిన్ సైనికుల డ్యాన్స్‌కు చెందిన వీడియోను పోస్టు చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు ఆరు ల‌క్షల వ్యూవ్స్ వ‌చ్చాయి. ఆరు వేల మంది లైక్ కొట్టారు. ఈ యేటి ఆస్కార్స్ వేడుక‌ల్లో నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఓరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో అవార్డు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను నిజానికి ఉక్రెయిన్‌లోనే షూట్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అధికార నివాసం బ‌య‌టే ఈ పాట‌ను షూట్ చేశారు. అయితే అప్పటికి ఉక్రెయిన్‌పై ర‌ష్యా అటాక్ చేయ‌లేదు.