NTV Telugu Site icon

Zelensky: ఖేర్సన్‌ మాదే.. రష్యన్‌ దళాలు ఉపసంహరించుకున్న తర్వాత జెలెన్స్కీ ప్రకటన

Zelensky

Zelensky

Zelensky: ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌ నగరం నుంచి రష్యా దళాలు ఉపసంహరించుకున్న తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ‘ ఖేర్సన్‌ మాదే’ అని ప్రకటించారు. దీనిని అమెరికా అసాధారణ విజయంగా ప్రశంసించింది. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌ బలగాలు నగర శివార్లలో ఉన్నాయని, ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పటికే నగరంలో ఉన్నాయని జెలెన్స్కీ టెలిగ్రామ్‌లో రాశారు. ఉక్రేనియన్ దళాలు నివాసితులతో సమావేశమైనట్లు కనిపించిన ఫుటేజీని పోస్ట్ చేశారు. ప్రజల సందడి, నగరవ్యాప్తంగా ఉక్రెయిన్‌ జెండాలు వెలిసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. దక్షిణాన కిన్‌బర్న్ కేప్ మినహా మొత్తం ప్రాంతం ఉక్రేనియన్ నియంత్రణకు తిరిగి వచ్చిందని గవర్నర్ విటాలి కిమ్ చెప్పారు.

remarks against President:’మన రాష్ట్రపతి ఎలా కనిపిస్తారు’.. టీఎంసీ మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలగుతున్నట్లు రష్యా సైన్యం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రష్యా శుక్రవారం ప్రకటించింది. నిప్రో నదిపశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. సిబ్బందితోపాటు ఆయుధ సామగ్రిని నిప్రో నది తూర్పు తీరంవైపు తరలించినట్లు పేర్కొంది. ఖేర్సన్‌ నగరం క్రమంగా తమ నియంత్రణలోకి వస్తున్నట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని తెలిపింది. స్థానికంగా ఎవరైనా రష్యా సైనికులు ఉంటే.. వెంటనే లొంగిపోవాలని సూచించింది. తమ సేనలు దాదాపు 41 ప్రాంతాలను విముక్తి చేసినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ప్రకటించారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగారు. మరోవైపు.. ఖేర్సన్‌ సమీప మైకోలైవ్‌లోని నివాసిత ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.