NTV Telugu Site icon

UK PM Rishi Sunak : సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టిన ప్రెసిడెంట్

Rishi Sunak

Rishi Sunak

UK PM Rishi Sunak : సీట్‌ బెల్ట్‌ ధరించనందుకు బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. ఓ వీడియో చిత్రీకరణ కోసం.. ప్రయాణంలో ఉన్న సమయంలో ఆయన కొద్దిసేపు సీట్‌బెల్ట్‌ తొలగించారు. ఓ ప్రచార కార్యక్రమం నిమిత్తం వీడియో చిత్రీకరిస్తుండగా రిషి సునాక్‌ కారులో వెనకాల కూర్చొని మాట్లాడారు. ఈ సమయంలో ఆయన సీటు బెల్టు ధరించలేదు. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని అయి ఉండి రూల్స్ పాటించకపోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో రిషి తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు.

Read Also: Aparna Balamurali: ఇంత నీచంగా ప్రవర్తిస్తారా.. ఆ ఘటనపై అపర్ణ ఫైర్

దీనిపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్టు ధరించనందుకు తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈమేరకు స్పందించారు. రిషి అధికార ప్రధినిధి జేమీ డేవిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో కరోనా ఆంక్షల సమయంలో కూడా రిషి నిబంధనలు అతిక్రమించారు. పోలీసులు అందుకు జరిమానా కూడా విధించారు. అప్పుడు కూడా ప్రజల ఆగ్రహానికి గురై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఇరకాటంలో పడ్డారు.

Read Also : IT Layoffs: ఆర్థికమాంద్యం భయాలు.. ఐటీ రంగంలో సంక్షోభం.. ఊడుతున్న ఉద్యోగాలు

దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ రిషిపై విమర్శలను గుప్పించింది. గతంలో ఓసారి ఆయన కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డును ఉపయోగించేందుకు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసింది. బ్రిటన్‌లో కారు ప్రయాణికులు సీట్‌ బెల్ట్‌ ధరించకపోతే అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. వ్యవహారం కోర్టుకు చేరితే 500 పౌండ్ల వరకు జరిమానా పెరిగే అవకాశం ఉంటుంది.

Show comments