UK Hospital’s Christmas Message: బ్రిటన్లో ఓ ఆస్పత్రి చేసిన పనికి రోగులంతా హడలిపోయారు. కొందరైతే ఏకంగా ఏడ్చేశారు. బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌లోని ఆసుపత్రిలో ఉన్న రోగులకు క్రిస్మస్ ఈవ్‌లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. కానీ పొరపాటున వారందరికీ టెర్మినల్ లంగ్ క్యాన్సర్ ఉందని తప్పుగా మెసేజ్ పంపింది. దీనిని చూసి వారంతా భయాందోళనకు గురయ్యారు.
Read Also: Jammu & Kashmir Snowfall : జమ్మూలో హిమపాతం.. మూసుకుపోయిన శ్రీనగర్-లేహ్ రోడ్డు
మెసేజ్ ఓపెన్ చేయగానే వారికి తీవ్ర స్థాయిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లుగా ‘డీఎస్1500’ అంటూ అందులో ఉంది. ఈ మెసేజ్ చూసి కొందరు రోగులు భయంతో వారంతా తమ బాధను ఫేస్‌బుక్‌లో వెళ్లగక్కారు. కాగా, జరిగిన పొరపాటును ఆ హాస్పిటల్ గుర్తించింది. ఆ వెంటనే క్షమాపణలు చెబుతూ మరో మెసేజ్ పంపింది. ‘దయచేసి గతంలో పంపిన సందేశానికి హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాం. పొరపాటున దీనిని పంపాం. మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అత్యవసర పరిస్థితుల్లో దయచేసి ఎన్‌హెచ్‌ఎస్ 111 నంబర్‌ను సంప్రదించండి’ అని అందులో పేర్కొంది.
